Connect with us

Devotional

శాస్త్రోక్తంగా ఆలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం: Stockton, SHCCC

Published

on

కాలిఫోర్నియాలోని స్టాక్టన్ హిందూ కల్చరల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ (SHCCC) వారి ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 4 ఎకరాల్లో అత్యంత సువిశాలంగా 30 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం జరగడం విశేషం. స్టాక్టన్ పరిసర ప్రాంతాల్లోని భక్తుల కోసం ఆలయంతో పాటు యోగా సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రాణ ప్రతిష్ట, సంప్రోక్షణ, కుంభాభిషేకం, ప్రారంభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఐదు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన క్రతువులు ఆదివారం నాడు ముగిశాయి. ఆలయ అధ్యక్షులు సంజీవ్ గోస్వామి, ఆలయ ఉపాధ్యక్షులు డా.రఘునాథ్ రెడ్డి, వైఖానస ప్రధాన అర్చకులు సత్యనారాయణ ఆచార్యులు, శ్రీధరాచార్యులు, శైవాగమ అర్చకులు సాయి వెంకట క్రిష్ణ తదితరులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రముఖ గురు వాసమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

గత ఆదివారం నాడు జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ వో ఇండియన్ కాన్సులేట్ సీజీఐ డా.రాఘవేంద్ర ప్రసాద్ దంపతులు విచ్చేశారు. ముగింపు కార్యక్రమానికి స్టాక్టన్ పరిసర ప్రాంతాల్లోని స్థానికులు, తెలుగువారు, పంజాబీ కుటుంబాల వారు, భారతీయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గత 12 సంవత్సరాలుగా ఈ దేవాలయం కోసం ఎంతో కష్టపడిన వెంకట్ & లక్ష్మి ఈమని, సంజీవ్ & పింకీ గోస్వామి, ఉమా & రతన్ నాయుడు, ఫాతిమా & అనీష్ ప్రకాష్, పల్లవి & రఘునాథ్ రెడ్డి కుటుంబాల కృషి నిజంగా అభినందనీయం.

ఆదివారం 2/20/2022—ఉదయం 8 గంటల నుంచి జరిగిన కార్యక్రమాల వివరాలు:-

విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
వాస్తు హోమాలు
వాస్తు పర్య అగ్నికరణం-విష్ణుపరివార్
మహా శాంతి అభిషేకం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
కళన్యాస హోమాలు
ప్రాయశ్చిత్త హోమాలు
శివ పరివార్-నాడి సంధానం
మహా పూర్ణాహుతి
ప్రధాన కుంభ ఆలయ ప్రవేశం
ప్రాణ ప్రతిష్ఠ (కుంభాభిషేకం)
స్వాములకు అలంకారం
ధేను (గోమాత) దర్శనం
విప్ర దర్శనం
కన్య దర్శనం
సువాసిని దర్శనం
కుంభ దర్శనం
జ్వాలా దర్శనం
దర్పణ దర్శనం
కూష్మాండ బలి (బూడిద గుమ్మడికాయ) దర్శనం
ప్రథమ నివేదన
మహా నివేదన
మహా మంగళ హారతి
మంత్ర పుష్ప
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
ఆచార్యులకు సన్మానం

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected