Connect with us

Government

శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ని కలిసిన GWTCS బృందం

Published

on

శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా వాషింగ్టన్ డీసీ (Washington DC) పర్యటనలో ఉన్న సందర్భంగా జనవరి 21 శనివారం రోజున GWTCS అధ్యక్షులు కృష్ణ లామ్ ఆధ్వర్యంలో GWTCS కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇలా కలిసిన వారిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (Consulate General of India), మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్ (Ministry of Foreign Affairs) లో భాగంగా ఇంతకుముందు కూడా డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కాలిఫోర్నియా, బే ఏరియా లోని కొన్ని కంపెనీలను హైదరాబాద్ లో ఏర్పాటుచేసేలా ప్రోత్సహించారు.

పక్కనే ఉన్న వర్జీనియా (Virginia) లోని యాష్బర్న్ (Ashburn) పట్టణంలో అధ్యక్షులు కృష్ణ లామ్ (Krishna Lam) ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ కార్యక్రమంలో GWTCS కార్యవర్గం డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ మరియు వారి ధర్మపత్నిని శాలువా మరియు పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా కృష్ణ లామ్ మాట్లాడుతూ GWTCS తరపున శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ (Consul General) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ (Dr. TV Nagendra Prasad) ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందించామన్నారు. అనంతరం అందరూ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected