వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ (Greater Washington Telugu Cultural Sangam) స్వర్ణోత్సవాలను (Golden Jubilee Celebrations) పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. జీడబ్ల్యూటీసీఎస్ అందాల పోటీలకు, ఆట, పాట పోటీల్లో ఎంతోమంది పాల్గొని విజయవంతం చేశారు.
కల్చరల్ గాలా (Cultural Gala) పేరుతో గోల్డెన్ వాయిస్ (Golden Voice) పోటీలను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల వారీగా పోటీలలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. డాన్సింగ్ సూపర్ స్టార్ (Dancing Superstar) పేరుతో నిర్వహించిన పోటీల్లో కూడా ఎంతోమంది పాల్గొన్నారు.
సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆగస్టు 25వ తేదీన విల్లార్డ్ మిడిల్ స్కూల్ (Willard Middle School, Virginia) లో ఈ పోటీలు జరిగాయి. వివిధ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ వయస్సులవారీతో వేదిక జరిగి ప్రాంతం సందడిగా కనిపించింది. అలాగే వివిధ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు కృష్ణ లాం (Krishna Lam) మాట్లాడుతూ… ఈ పోటీలకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారందరినీ ఆయన అభినందించారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరిగే జిడబ్ల్యూటిసిఎస్ స్వర్ణోత్సవ వేడుకలకు (Golden Jubilee Celebrations) కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ పోటీలను ఎంతో చక్కగా నిర్వహించిన కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ సుష్మ అమృతలూరి (Sushma Amruthaluri), సెక్రటరీ (కల్చరల్) శ్రీ విద్యా సోమ (Srividya Soma) తోపాటు వారి టీం గణేష్ ముక్క నంద చెల్లువేది అమర్ అతికం, శ్రావణి వింజమూరి, నివేదిత చంద్రుపట్ల, శిరీష, పావని పూదోట తదితరుల సేవలను కృష్ణ లాం కొనియాడారు. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు పలువురు జడ్జీలుగా వ్యవహరించారు.
సుశాంత్ మన్నె, రవి అడుసుమిల్లి (Ravi Adusumilli), భాను మాగులూరి, శ్రీనివాస్ గంగ, పద్మజ బెవరా, చంద్ర మాలావతు తదితరుల GWTCS (Greater Washington Telugu Cultural Sangam) ఎగ్జిక్యూటివ్ కమిటీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షించి విజయవంతం చేశారు.