అక్టోబర్ 3న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో రెస్టన్, వర్జీనియాలో నిర్వహించిన 5కె రన్/వాక్ విజయవంతమైంది. GWTCSఅధ్యక్షులు సాయి సుధ పాలడుగు నేతృత్వంలో ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయులు విరివిగా పాల్గొన్నారు. వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్ మరియు కామన్వెల్త్ అటార్నీ వంటి ప్రత్యేక అతిధులు పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా సాయి సుధ మాట్లాడుతూ వాలంటీర్స్, పెద్దలు మరియు తమ కార్యవర్గం చాలా సహకారం అందించారని అన్నారు. ట్రయల్ నిర్వహణ, టీ షర్ట్స్ పంపిణీ, జూమ్బా వర్కౌట్, మెడల్స్ ఇలా అన్ని విభాగాలలో పక్కాప్రణాళికతో ప్రిపేర్ అయ్యామన్నారు. 400 మందికి పైగా పాల్గొని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.
పిల్లలకి ప్రత్యేకంగా నిర్వహించిన 1కె వాక్ వారిలో ఆహ్లాదాన్ని నింపింది. అన్ని వయోవర్గాల పిల్లలు, పెద్దలు చురుకుగా పాల్గొని ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అతి పెద్ద విజయవంతమైన కార్యక్రమంగా నిలిపారు. పాల్గొన్న వారందరికీ టీ షర్ట్, మెడల్ అందించారు. రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అందరికి మంచి ఉత్సాహాన్నించ్చింది. కల్చరల్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా ఇలా ఉల్లాస కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేయడం అభినందనీయం.
తానా గత అధ్యక్షులు సతీష్ వేమన, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు కవిత చల్లా, GWTCSగత అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, స్థానిక ఆటా ప్రతినిధులు తదితరులు పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు.