Connect with us

Diwali

సంతోష కాంతులతో పండుగ వాతావరణంలో అలరించిన ‘గాటా’ దీపావళి వేడుకలు: Atlanta, GA

Published

on

సుమారు 1500 అట్లాంటా వాసుల హర్షధ్వానాలతో కళకళలాడిన GATA దీపావళి వేడుకలు October 30న DeSana Middle School ప్రాంగణంలో సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ పండుగ వాతావరణాన్ని ఉత్తేజపరిచిందంటూ పలువురి ప్రశంసలను అందుకుంది.

Suvidha Groceries, RAPIDIT Inc, Orpine Inc, EiS Technologies, Sekhar Putta Realtors మరియు Sri Girish Modi వారి సౌజన్యంతో రూపుదిద్దుకున్న ఈ సంబరంలో చోటుచేసుకున్న ఆత్మీయ ఆహ్వానం, సాంస్కృతిక సాంప్రదాయ కళా సమ్మిళిత వైభవం, కార్యకర్తల ప్రోత్సాహం, అతిథుల ఉత్సాహం, ఆద్యంతం ఉప్పొంగిన ఉల్లాసం GATA సంస్థ నిర్వహణ పటిమను ప్రతిబించాయి.

సాంప్రదాయ పద్ధతిలో జ్యోతి ప్రజ్వలనతో, గణనాథుని కీర్తనతో, సాదర స్వాగత సత్కారాలతో ఆరంభమొంది, జానపద, శాస్త్రీయ, చలనచిత్ర సంగీత నృత్య ప్రదర్శనలు, అలరించే మాటలు, అల్లరిచేయించే ఆటలు, సన్మానాలు దీపావళి పండుగ కాంతులై మిరుమిట్లు గొలిపాయి అనడంలో అతిశయోక్తి లేదు.

తమ ఉత్తేజభరిత వాక్చాతుర్యంతో లావణ్య గూడూరు ప్రేక్షకులను అలరించగా, మొదటిసారి వేదిక పై వ్యాఖ్యాతగా అడుగిడిన కల్యాణి అబ్బగారి తమదైన శైలిలో సందడి నెల్పకొల్పారు. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకులు S S Thaman రాక తో పండుగ వాతావరణం మరింత ఊపందుకుంది.

విశేష అతిథిగా తమ గలగల మాటలతో, అద్వితీయ గాత్రంతో ప్రేక్షకులను మొదలుకొని సంస్థ కార్యకర్తలతో సైతం ఆడిపాడించిన Hanishka Polimera ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ కాగా, అట్లాంటా అభిమాన గాయనిమణులు Raga Vahini, Sravanthi K T మరోమారు తమ అద్భుత గానంతో అందరి మన్ననలు పొందారు.

కార్యక్రమంలో భాగంగా ప్రసంగిస్తూ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులందరికీ, నిర్వహణలో సహకారాన్ని అందించిన వ్యవస్థాపకులకు, వదాన్యులకు, సంస్థ కార్యకర్తలకు, స్వచ్ఛంద సేవకులకు GATA 2022 Chief Coordinator Jaya Chandra Reddy పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియచేసారు. ఈ సందర్భంగా సంస్థ కార్య నిర్వాహక బృందానికి మొమెంటోలను బహూకరించారు.

Satya Karnati ఉల్లాసభరిత DJ, Sridhar Vakiti అద్భుత Audio సహకారం, శృతి చిత్తూరి Creative Bells Decoration, 3rdIC (Raghu Valasani) ఫోటోగ్రఫీ, Suvidha మరియు Sri Krishna Vilas రెస్టారెంట్ వారి విందు సమర్పణలకు, విక్రయదారుల సందడులకు GATA బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

వివిధ కళా నైపుణ్య ప్రదర్శనలతో అలరించిన చిన్నారులను, గురువులను పూలగుచ్ఛాలతో, పతకాలతో సంస్థ సత్కరించడం అభినందనీయం. పలువురి అభినందనల నడుమన, ఎల్లరి ఆత్మీయత నీడన సంతోష కాంతులతో అల్లుకున్న GATA దీపావళి వేడుక భారత జాతీయ గీతాలాపనతో ముగించడం ముదావహం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected