తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన సంగర్తి జాని ఊపాది కోసం దుబాయ్ వెళ్లారు. దురదృష్టం కొద్దీ గత సంవత్సరం దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజుల క్రితం సంగర్తి కవిత ఇంట్లో కరెంట్ షాక్ కి గురి అయ్యి మరణించడంతో వీరి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినరు.
ఇట్టి విషయాన్ని చింతపండు రవి మరియు అశోక్ ద్వారా అమెరికా లో స్థిరపడిన ఖానాపూర్ ప్రాంత నివాసి అయినటువంటి శ్రీ పన్నెల జనార్ధన్ గారికి తెలియచేయగా తను ప్రత్యేక చోరవ తీస్కొని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తరపున ఒక లక్ష రూపాయలు సంగర్తి సహన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ లక్ష రూపాయల చెక్కుని ఖానాపూర్ అసెంబ్లీ గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ చేతుల మీదుగా సంగర్తి సహన కి అందజేయడం జరిగింది.
ఈకార్యక్రమానికి సహకారం అందించిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీఅధ్యక్షులు సునీల్ గోటూర్ గారు, చైర్మన్ ప్రభాకర్ మడుపాటి గారు, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ పన్నెల గారు, సెక్రెటేరి శ్రీని పర్సా గారు, కోశాధికారి సందీప్ గుండ్ల గారు, కల్చరల్ సెక్రటరీ నవీన్ బత్తిని గారు, టెక్నాలజీ సెక్రెటరీ రమణ గండ్ర గారు, మీడియా సెక్రటరి గణేష్ కోసం గారు, ఈవెంట్స్ సెక్రటరీ చలపతి వెన్నమనేని గారు, స్పోర్ట్స్ సెక్రెటేరి కీర్తిదర్ గౌడ్ చక్కిల గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కిషన్ తాళ్లపల్లి గారు, రామాచారి నక్కేర్టీ గారు, నవీన్ ఉజ్జిని గారు, రఘువీర్ రెడ్డి గాడిపల్లి గారు, జ్యోత్స్నా పాలకుర్తి గారు, అడ్వైజరి మెంబర్స్, వివిధ కమిటీలకు సంబందించిన చైర్స్స్, కోచైర్స్ మరియు గేట్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియ చేయడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో చింతపండు రవికుమార్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, కొక్కుల ప్రదీప్, అశోక్, మహేష్ నరేందర్, నాగరాజు, సంగర్తి రాజన్న, రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.