Published
2 years agoon
By
NRI2NRI.COMగ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన బతుకమ్మ, దసరా పండుగ సంబరాలను దేసానా మిడిల్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. పూలను పేర్చి పండుగలా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మను 17 ఏళ్లుగా GATeS అంగరంగ వైభవంగా జరుపుతోందని సంస్థ అధ్యక్షులు సునీల్ గోటూరు తెలిపారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ వందల సంఖ్యలో బతుకమ్మలను తయారు చేసి వేడుకలో పాల్గొనేలా కృషి చేసిన మహిళలకు GATeS తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, తెలంగాణ జానపద గేయాలు, బతుకమ్మ పాటలు, డప్పుల మోతలను సమన్వయ పరచడంలో గాయని మల్లికతో కలిసి పూల పండుగను అట్లాంటలో ఘనంగా జరుపుకునేందుకు GATeS ఈసీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్ మరియు కల్చరల్ సెక్రెటరీ, నవీన్ బత్తిని గారి కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.
ఇక కార్యక్రమాల విషయానికి వస్తే GATeS ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబురాలు ముందుగా ఈసీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఛైర్మన్లు, అధ్యక్షుల కుటుంబసభ్యులు మరియు పూజారి శ్రీనాథ్ దరూరి జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. గౌరీ పూజ, జానపద కళాకారిణి మల్లిక స్వరంతో వేడుక మొదలు పెట్టగా, మహిళలందరూ ఒక్కచోటుకు చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి చప్పట్ల మేళాల మధ్య బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ కోలాటం ఆడి పాడినట్లు పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగానే మనటీవీ యాంకర్ లావణ్య గూడూరు ప్రారంభోపన్యాసం చేయగా శృతిలయలు మ్యూజిక్ అకాడమీ నుంచి కేటీ స్రవంతి గేయాలను ఆలపించారు. నీలిమ గడ్డమనుగు, గరిమ డ్యాన్స్ అకాడమీ, సాహిత్య డ్యాన్స్ స్కూల్, కిన్కినిధ్వని కూచిపూడి నిత్యానికేతన్, ఏటూజెడ్ ఫన్ టైం, షిలోహ బెస్టీస్ డ్యాన్స్ అకాడమీల నుంచి నృత్య ప్రదర్శనలు జరిగాయి. బత్తిని సోదరీమణుల జానపద నృత్య ప్రదర్శన, విశ్వక్ తేజు పన్నెల వయొలిన్ ప్రదర్శన, మరియు అనీష్ గోసంగరి & వేద గోసంగరి గీతాలాపన ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే జానపద కళాకారిణి మల్లిక డప్పు వాయిద్యాలతో, మహిళల కోలాటం చప్పుళ్లతో బతుకమ్మ నిమజ్జనం జరిగింది. అనంతరం మంగళహారతి, ప్రసాదం వితరణ చేపట్టారు.
ఇదిలా ఉండగా బతుకమ్మల కూర్పునకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జోత్స్న పాలకుర్తి మరియు గీతా నారన్నగిరిలు మహిళా సంఘాలతో పనిచేసి బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మను ఆకర్శనీయంగా పేర్చిన వారికి GATeS అవార్డులను అందజేసింది. ఈ సంబురాల్లో భాగంగానే GATeS నిర్వహించిన టెన్నీస్ టోర్నమెంట్-2022 విజేతలకు, పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపింది.
అంతేకాకుండా GATeS అధ్యక్షులు, ఛైర్మన్ నేతృత్వంలో బతుకమ్మ వేడుకల నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లు, కమ్యూనిటీ లీడర్లకు GATeS ప్రత్యేక ధన్యవాదాలు తెలుపగా, సంస్థ చేస్తున్న సేవలకు నిరంతరం వెన్నంటే ఉండి నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రభాకర్ బోయపల్లికి జీఎస్ రెడ్డి స్మారక పురస్కారాన్ని, GATeSకు కిషన్ తళ్లపల్లి చేస్తున్న స్వచ్ఛంద సేవకు వాలంటీర్ పురస్కారంతో GATeS సంస్థ సత్కరించింది.
చివరగా GATeS అధ్యక్షుడు సునీల్ గోటూర్, చైర్మన్ ప్రభాకర్ మడుపతి ప్రతి ఏడాది GATeS చేస్తున్న సేవలు, బతుకమ్మ, దసరా సంబరాలను వివరించారు. ఈ మేరకు సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న సాఫ్ట్ పాత్ సిస్టమ్ మరియు రెడ్డి సీపీఏ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇతర స్పాన్సర్లైన స్ల్పష్ బీఐ, ర్యాపిడ్ ఐటీ, eగ్లోబల్ డాక్టర్స్, ఏబీఆర్ ప్రొడక్షన్స్, ఇన్ఫోస్మార్ట్ టెక్నాలజీస్, శేఖర్స్ రియాల్టీ, కమ్మింగ్ డెంటల్, సింఫోనీ సొల్యూషన్స్, యువర్ బుకింగ్ ట్రావెల్, వేదా డెంటల్ హాస్పటల్, ఏహెచ్పీ రియల్ ఎస్టేట్ వెంచర్స్, 27 కేర్స్, ఎస్ ఎస్ లెండింగ్, ఎఫిసెన్స్, ఎకోవ్, చారియట్ టెక్నాలజీ సొల్యూషన్స్, స్క్రీమ్నట్స్, కేబీ జావేరీ, యూనివర్సల్ రూఫింగ్, ఎడ్ గురూ అకాడమీ, డాక్టర్ దామోదర్ నెరెళ్ల ఎండీ, వెంకట్ సట్టూరు రియాల్టర్ మరియు శ్రీ కందాల మార్టిగేజ్ లోన్ కోఆర్డినేటర్ లకు కృతజ్ఞతలు అందజేశారు.
అలాగే వ్యక్తిగత స్పాన్సర్లు చందు పెద్దపట్ల, డాక్టర్ సతీష్ ఛెట్టి, డాక్టర్ వెంకట్ వీరనేని, రమణ గండ్ర, రాము వేనిగండ్ల, విజయ్ కుమార్ వింజమర, మాధవ రావు కుసుం, డాక్టర్ జయసింహ సుంకు, డాక్టర్ గోపాల్ రావు, రాహుల్ చిక్యాల, నంద చాట్ల, రవి కందిమల, డాక్టర్ విఠ్ఠల్ కుసుమ, శ్రీనివాస్ వరవూరు, విష్ణు బైసాని, అనూప్ గోగూరి, భాస్కర్ నారన్నగారి తోపాటు అడ్వైజరీ, ఈసీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కమిటీ మెంబర్స్, వాలంటీర్లు, గాయకులు, డ్యాన్స్ అకాడమీలు, శ్రీ ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, ట్రెండీ ఈవెంట్స్ ఆడియో, మధురమా ఈవెంట్స్ డెకోరేషన్ మరియు మీడియా పార్ట్నర్ల (టీవీ 9, టీవీ5, ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ, మనటీవీ) లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే GATeS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జోత్స్న పాలకుర్తి గారు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి వివరించారు. దానితో పాటు బతుకమ్మ, దసరా సంబురాలు విజయవంతం కావడానికి సహకరించి, తమ సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థలైన IFA, TAMA, GATA, TDF Atlanta Chapter, National Organizations ATA, TANA, NATA and TTA లకు ధన్యవాదాలు తెలిపారు.
GATeS అధ్యక్షుడు సునీల్ గోటూర్ మడుపతి మాట్లాడుతూ ఈ వేడుకలు నిర్వహించేందుకు GATeS వాలంటీర్లు గత రెండు నెలలుగా పడిన శ్రమను ప్రత్యేకంగా గుర్తించదగినదని, వారి కృషి కారణంగానే ఈ బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయని ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి పేర్కొన్నారు. ఇదో గొప్ప విజయంగా మేము భావిస్తున్నామని, ఒక వేడుక విజయవతంగా పూర్తి కావడానికి వాలంటీర్ల నిస్వార్థ సేవే కారణమని GATeS అధ్యక్షులు సునీల్ గోటూరు వెల్లడించారు. ఈ మేరకు వాలంటీర్ టీమ్, హెల్ప్ లైన్ టీమ్, స్కాలర్ షిప్ టీమ్ లకు GATeS అధ్యక్షులు సునీల్ గోటూరు, ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో GATeS ఈసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అధ్యక్షులు సునిల్ గోటూరు, ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి, ఉపాధ్యక్షులు జనార్ధన్ పన్నెల, జనరల్ సెక్రెటరి శ్రీనివాస పర్స, కోశాధికారి సందీప్ రెడ్డి గుండ్ల, కల్చరల్ సెక్రెటరి నవీన్ బత్తిని, ఈవెంట్ సెక్రెటరి చలపతి వెన్నమనేని, మీడియా సెక్రెటరి గణేష్ కాసమ్, టెక్నాలజీ సెక్రటరి రమణ గాండ్ర, స్పోర్ట్స్ కీర్తిధర్ గౌడ్ చెక్కిలా, బోర్డు డైరెక్టర్లు రామాచారి నక్కెర్టి, జోత్న్స పాలకుర్తి, కిషన్ తల్లపల్లి, రఘువీర్ రెడ్డి గుడిపల్లి, నవీన్ ఉజ్జిని మరియు ఇతర కార్యవర్గసభ్యులు, వాలంటీర్స్ GATeS Team-2022 తదితరులు పాల్గొన్నారు.
GATeS ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు:-
GATeS ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అటు అమెరికాలోను, ఇటు తెలంగాణలో కూడా నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందించడంతోపాటు విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం, ఆన్ లైన్ ద్వారా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆహార పంపిణీ, చలికాలంలో దప్పట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేపట్టారు. ఇవే కాకుండా పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్న భారతీయులు సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా బతుకమ్మ, దసరా లాంటి వేడుకలు జరపటంలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటి (GATeS) ముందుకెళుతోంది.