Connect with us

Politics

పరిటాల శ్రీరామ్ కి చికాగోలో పెద్దఎత్తున స్వాగతం

Published

on

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఆత్మీయ సమావేశం చికాగోలో సిటీ తెలుగు ఎన్అర్ఐలు, పరిటాల రవి మరియు టీడీపీ అభిమానుల హర్షాతిరేకాలు మధ్య ఆద్యంతం ఒక ప్రభంజనం లాగా సాగింది. శ్రీరామ్ అమెరికా పర్యటనలో భాగంగా చికాగో నగరానికి విచ్చేసి వున్నారు.

ఈ సందర్భంగా ఎన్అర్ఐ టీడీపీ యుఎస్ఎ కోఆర్డినేటర్ కోమటి జయరాం గారు, చికాగో టీడీపీ నాయకులు హేమ కానూరు గారు మరియు ఎన్అర్ఐ టీడీపీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో చికాగో టీడీపీ ప్రెసిడెంట్ రవి కాకర ప్రారంభ ఉపన్యాసం చెయ్యగా రవి ఆచంట, అజాద్, కాశి పాతూరి, మదన్ పాములపాటి, శ్రీనివాస్ పెదమల్లు, ఉమ కటికి, చాందినీ దువ్వూరి, రఘు చిలుకూరి, వెంకట్ యలమంచిలి, చిరు గళ్ళ, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ ఇంటూరి, శ్రీనివాస్ అట్లూరి, వెంకట్ చిగురుపాటి, మనోజ్ మొదలైన వక్తలు ప్రసంగించారు.

శ్రీరామ్ ప్రసంగిస్తూ మొదటగా అన్న ఎన్టీఆర్ (NTR) శతజయంతి పురస్కరించుకొని, ఆ మహా నాయకుడు తెచ్చిన విప్లవాత్మక మార్పులు, సంక్షేమ కార్యక్రమాలు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచడం, అలాగే చంద్రబాబు (Nara Chandrababu Naidu) తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా ఎంతో మంది ఎన్అర్ఐలుగా స్థిరపడడానికి దోహదం చేశాయని వివరించారు.

లోకేష్ (Nara Lokesh) యువగళం ఒక ప్రభంజనంలా సాగిపోతుందని తనతో నడిచిన అనుభవాన్ని గుర్తుతెచుకొన్నరు. టీడీపీ ప్రభుత్వంలో అనంతపురంలో జరిగిన అభివృద్ధి, కియా పరిశ్రమ ద్వారా ముప్పై వేల మందికి ఉపాధి, హార్టికల్చర్ అభివృద్ధి ద్వారా రాయలసీమ నుంచి విదేశాలకు ఎగుమతులు జరిగాయని వివరించారు.

టీడీపీ మిని మానిఫెస్టో మహిళా సాధికారతను, నిరుద్యోగులకు లక్షలలో ఉద్యోగాలు, రైతులకు వెన్నుముక్కగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ (Paritala Ravindra Memorial Trust) ద్వారా తమ పుట్టిన నేలకు ఫ్లోరైడ్ సమస్య లేకుండా వాటర్ ట్యాంకులు నిర్మాణం పనులు చెప్పట్టిందని నాన్న గారి వారసత్వంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని అన్నారు.

జగన్ (YS Jagan Mohan Reddy) అరాచక పాలనను ఖండిస్తూ రాష్త్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ (Telugu Desam Party) అధికారంలోకి రావాలని దానికి ఎన్అర్ఐలు అందరూ ముందుకు వచ్చి ప్రజలను చైతన్య పరచాలని కోరారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువత ఉత్సాహాన్ని చూస్తే శ్రీరామ్ (Paritala Sriram) లాంటి యువ నాయకులు వల్ల టీడీపీకి మరో 40 సంవత్సరాలు తిరుగులేదని అనిపించింది. ఈ కార్యక్రమానికి మిల్వాకీ, మాడిసన్, బ్లూమింగ్టన్ నుంచి కూడా అభిమానులు తరలి రావడం కార్యక్రమం విజయవంతం అవ్వడానికి దోహదపడింది.

చికాగో ఎన్అర్ఐ టీడీపీ కార్యనిర్వహక సభ్యులు, ప్రెసిడెంట్ రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, సెక్రెటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరరు విజయ్ కోరపాటి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘు చిలుకూరి, రీజనల్ కౌన్సిలర్ చిరంజీవి గళ్ళ తో పాటు, రవి నాయుడు, కృష్ణ మోహన్ చిలమకూరు, హను చెరుకూరి, సందీప్ ఎల్లంపల్లి, లక్ష్మణ్ మొదలైన వారు సహకరించగా హేమ కానూరు గారు కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected