Connect with us

News

నందమూరి బాలకృష్ణ కుటుంబానికి న్యూయార్క్ లో ఘన స్వాగతం, కోలాహలంగా విమానాశ్రయం

Published

on

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కన్వెన్షన్ కి ముఖ్య అతిధిగా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హాజరవుతున్న సంగతి అందరికీ విదితమే.

తానా కన్వెన్షన్ లో పాల్గొనేందుకు నిన్న హైదరాబాద్ లో బయలుదేరిన బాలయ్య ఈ రోజు ఉదయం న్యూయార్క్ లోని ఎయిర్పోర్ట్ లో దిగారు. ఈ సందర్భంగా తానా నాయకులు, నందమూరి మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు.

పుష్పగుచ్ఛాలతో, తెలుగుదేశం పార్టీ జెండాలతో జై బాలయ్య (Jai Balayya) నినాదాలు చేశారు. అందరూ పోటీ పడి మరీ ఫోటోలు దిగారు. అనంతరం బాలకృష్ణ (Nandamuri Balakrishna) కుటుంబ సమేతంగా కారులో బయలుదేరి వెళ్లారు. బాలయ్యతో తన మనవడు కూడా ఉన్నారు.

స్వాగతం పలికిన వారిలో జానీ నిమ్మలపూడి, పురుషోత్తమ చౌదరి గుడే, మోహనకృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, రాజా సూరపనేని, మోహన్ వెనిగళ్ల, సాహు గారపాటి, రావు వోలేటి, ఆదిత్య గోగినేని, బాలనారాయణ మద్ద, దిలీప్ కుమార్ చండ్ర తదితరులు ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected