Connect with us

General

ఉత్సాహంగా గోదావరి జిల్లాల ప్రవాసుల ఆత్మీయ సమావేశం @ Detroit, Michigan

Published

on

Detroit, Michigan: జులై 3 – 5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరిగిన 24 వ తానా మహాసభల్లో గోదావరి ప్రవాసుల సంఘం(Godavari NRIs ) ఆధ్వర్యంలో జులై 4 వ తేదీ న గోదావరి జిల్లాల ప్రవాసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తానా (TANA) కి విచ్చేసిన మన గోదావరి జిల్లా వాసులు అందరూ వచ్చి ఉత్సాహం గా పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా శ్రీ మురళీమోహన్‌ (Murali Mohan) గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణం రాజు (Raghuramakrishnam Raju) గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ముళ్ళపూడి బాపిరాజు గారు, చింతలపూడి MLA శ్రీ రోషన్ కుమార్ గారు, TV5 CEO మూర్తి గారు, మహాసేన రాజేష్ గారు, నల్లూరి ప్రసాద్ గారు పాల్గొని ప్రసంగించారు. గోదావరి జిల్లా అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి సుధా పాలడుగు (Sai Sudha Paladugu) గారు, అమృతా ముత్యాలా గారు, సతీష్ చుండ్రు గారు, నాగేశ్వరరావు మన్నే గారు, రామ్ వంకిన గారు, జనార్దన్ నిమ్మలపూడి గారు, సతీష్ మేకా గారు, సుబ్బా యంత్రా గారు, సుమంత్ పుసులూరి గారు, రాంప్రసాద్ చిలుకూరి గారు, సుశాంత్ మన్నే గారు, రాజ్ కామేటి గారు, సూర్య మాచేటి గారు, కిషోర్ తమ్మినీడి గారు, సప్త గిరీష్ ఇందుగుల గారు, రాణి అల్లూరి గారు అందరికి ధన్యవాదాలు !!!

కిలిమంజారో (Kilimanjaro) పర్వతాన్ని అధిరోహించిన జనార్దన్ నిమ్మలపూడి (Janardhan Nimmalapudi) గారిని శ్రీ మురళి మోహన్ గారు సత్కరించడం జరిగింది. ఈ సమావేశం లో మన కార్యక్రమానికి రుచికరమైన గోదావరి సాంప్రదాయక స్వీట్స్ తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, పాలకోవా బిళ్ళలు, కోవా కజ్జికాయలు, బెల్లం గవ్వలు, బెల్లం బూందీ,

మరియు గోరుమీటీలు పంపించిన ఆత్రేయపురానికి చెందిన సాయి గారికి ( చాదస్తం ఫుడ్స్), రాజమండ్రి రోజ్ మిల్క్ ఏర్పాటు చేసిన సప్త గిరీష్ ఇందుగుల గారికి, మిరపకాయ బజ్జీలు, సమోసాలు, టీ పంపించిన విస్సు గారికి (నమస్తే విస్సు )… ఈ కార్యక్రమం కి విజయవంతం అవ్వడానికి సహకరించిన మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు !!!

ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన విద్యా గారపాటి(movers.com ) గారికి, సతీష్ మేకా గారికి, sweeja jewelery రాజు వేగేశ్న గారికి, కిరణ్ పర్వతనేని గారికి, నాగేశ్వర రావు మన్నే గారికి, విస్సు నమస్తే గారికి, మహేష్ సాగినా గారికి మరియు గోదావరి ఫౌండింగ్ కమిటీ మెంబెర్స్ అందరికి ధన్యవాదాలు !!!

error: NRI2NRI.COM copyright content is protected