డిసెంబర్ 21న జరుపుకునే ప్రపంచ ధ్యాన దినోత్సవం (World Meditation Day) సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు సమాజాన్ని ఒక విశిష్ట గ్లోబల్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ మరియు శ్రీ రామ్ చంద్ర మిషన్ (Shri Ram Chandra Mission) సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆన్‌లైన్ మెడిటేషన్ సెషన్‌లో పాల్గొనవలసిందిగా తానా పిలుపునిచ్చింది.
ఈ సమిష్టి గ్లోబల్ ధ్యానానికి హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ దాజీ (Kamlesh D Patel) నాయకత్వం వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ కార్యక్రమం (Meditation), వింటర్ సోల్స్టీస్‌కు అనుగుణంగా ఆత్మపరిశీలన, సమతుల్యత, అంతరంగ శాంతి వంటి విలువలను ప్రతిబింబించనుంది.
ఈ ధ్యాన (Meditation) కార్యక్రమం ద్వారా వ్యక్తిగత మానసిక ప్రశాంతతతో పాటు, సమాజంలో శాంతి, స్థైర్యం, సామరస్య భావాలు పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తానా సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్యాభిలాషులు అందరూ ఈ ప్రపంచ శాంతి, నిశ్శబ్దం, సామరస్య క్షణంలో భాగస్వాములు కావాలని తానా (TANA) అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali) విజ్ఞప్తి చేశారు
కార్యక్రమ వివరాలు
తేదీ: ఆదివారం, డిసెంబర్ 21, 2025
సమయం: రాత్రి 8:00 గంటలు (భారత కాలమానం) | ఉదయం 8:30 గంటలు (CST)
ప్రత్యక్ష ప్రసారం: https://www.youtube.com/live/azpZtrs_fnk
రిజిస్ట్రేషన్: https://meditationday.global/en/
వివరాలకు సంప్రదించండి: త్రిలోక్ కంతేటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ, 703-585-3565