Connect with us

Cultural

అట్లాంటాలో ధూంధాంగా ‘గేట్స్’ తెలంగాణ సాంస్కృతిక దినోత్సవ వేడుకలు

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో జూన్ 5 న నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక దినోత్సవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలలో సుమారు 1500 మంది పాల్గొని విజయవంతం చేశారు.

ముందుగా గేట్స్ కార్యవర్గం మరియు బోర్డు సభ్యులు అందరినీ ఆహ్వానించి, జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. స్థానిక సంగీత మరియు నృత్య కళాశాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జనార్ధన్ పన్నెల పాటతో ఈ వేడుకల ప్రారంభోత్సవం గొప్పగా జరిగింది.

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గరిమ డాన్స్ అకాడమీ, శ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నూపుర్ స్కూల్ ఆఫ్ భరతనాట్యం, సిక్స్ స్ట్రింగ్స్ మ్యూజిక్ గ్రూప్, బత్తిని సిస్టర్స్, నటరాజ నాట్యాంజలి తదితర స్థానిక సంగీత మరియు నృత్య కళాశాలలు చూడచక్కని హై క్వాలిటీ ప్రదర్శనలతో వీనులవిందు చేశారు.

ఈ విషయంలో సాంస్కృతిక కార్యదర్శి నవీన్ బత్తిని ని ప్రత్యేకంగా అభినందించాలి. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్సెస్ తో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చక్కగా మిళితం చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ లైనప్ అంతా కూడా ఆద్యంతం అందరినీ అలరించేలా ప్లాన్ చేశారు. అలాగే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ లో కూడా బ్యాక్ స్టేజ్ లో చక్కగా సమన్వయం చేశారు.

జబర్దస్త్ ఫేమ్ హాస్యనటులు అదిరే అభి తన సిగ్నేచర్ మార్క్ హాస్యంతో అందరూ కడుపుబ్బా నవ్వుకునేలా చేయడమే కాకుండా వ్యాఖ్యానం చేయడం విశేషం. అదిరే అభి మరియు లావణ్య గూడూరు సందర్భానుచితమైన వ్యాఖ్యానంతో వేడుకలకు మరింత శోభ తెచ్చారు.

ఎల్లమ్మ గుడి నుండి వేదిక వరకు నిర్వహించిన బోనాలు జాతర అయితే అమెరికాలో ఉన్నామా లేక అట్లాంటాలో ఉన్నామా అనేలా మయమరిపించింది. డిజిటల్ స్క్రీన్ తో వేదిక అలంకరణ, ఫోటో బూత్, రుచికరమైన భోజనాలు, షాపింగ్ స్టాల్ల్స్ మరియు కిడ్స్ ఆర్ట్ ఫెస్టివల్ లో భాగంగా వివిధ తెలంగాణ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ చిన్నారులు ప్రదర్శించిన కల్చరల్ స్టాల్ల్స్ బహు బాగున్నాయి.

ఇండియన్ ఐడల్ ఫేమ్ రాక్ స్టార్ రేవంత్ సారధ్యంలో ఎం లైవ్ బ్యాండ్, టాలీవుడ్ ప్రముఖ గాయని దామిని భట్ల, జానపద గాయనీ గాయకులు మౌనిక యాదవ్, లక్ష్మి దోస, నిత్య తో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ సెట్ ది స్టేజ్ ఆన్ ఫైర్ అనేలా అందరినీ ఉర్రూతలూగించింది. ఫోక్, క్లాస్, మాస్, బీట్ ఇలా అన్ని రకాల పాటలతో వేడుకలకు గ్రాండ్ క్లైమాక్స్ అందించారు. అలాగే స్థానిక గాయకులు శ్రీనివాస్ దుర్గం తన పాటలతో మెప్పించారు.

సునీల్ గోటూర్ అధ్యక్షతన గేట్స్ కార్యవర్గం మరియు ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి సారధ్యలోని బోర్డు సభ్యులు ప్రత్యేక అతిధులుగా హాజరైన జాన్స్ క్రీక్ సిటీ మేయర్ జాన్ బ్రాడ్బెర్రి, ఫోర్సైత్ కౌంటీ షెరిఫ్ రాన్ ఫ్రీమన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ దండెబోయిన, అలాగే జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి మరియు దిలీప్ టుంకి లను సగౌరవంగా సత్కరించారు.

అలాగే ఈ వేడుకల టైటిల్ స్పాన్సర్స్ 27 కేర్స్ రీనా గుప్తా, అమిత్ గుప్తా మరియు ఎస్ ఎస్ లెండింగ్ శివ కుమార్ లను సన్మానించారు. ఈ సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వ్యవస్థాపకులను జ్ఞప్తికి తెచ్చుకొని అభినందించారు. క్రీడా పోటీల అవార్డులను మరియు వన్ మిలియన్ స్టెప్స్ ఛాలెంజ్ సాధకులకు బహుమతులు అందించారు.

ఈ సంవత్సరం స్టెప్ ఛాలెంజ్, బ్రేక్ఫాస్ట్ విత్ షెరిఫ్ & ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, బ్లడ్ డ్రైవ్, ఇండియాలో సేవాకార్యక్రమాలు వంటి కొత్త కొత్త కార్యక్రమాలతో గేట్స్ ని మరో అడుగు ముందుకు తీసుకెళుతున్న అధక్షులు సునీల్ గోటూర్ మరియు ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి లను అందరూ అభినందించడం విశేషం.

చివరిగా తెలంగాణ సాంస్కృతిక దినోత్సవ వేడుకలను అత్యంత విజయవంతం చేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తోటి గేట్స్ కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు, అడ్వైజరీ సభ్యులు, వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్, వాలంటీర్స్, చక్కని వేదికనందించిన డులూత్ లోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్, ఆడియో సహకారం అందించిన ట్రెండీ ఈవెంట్స్ టిల్లు, ఫోటోగ్రఫీ & వీడియో సేవలందించిన వాకిటి క్రియేషన్స్, అందమైన ఫోటోలను తమ కెమేరాలలో బంధించిన సురేష్ ఓలం, కమల ఓలం మరియు అనిల్ ఎడిగ, చక్కని ఫ్లయర్స్ మరియు డిజైన్ వర్క్ చేసిన నర్సింగరావు ఇలా ప్రతి ఒక్కరికీ గేట్స్ కార్యదర్శి శ్రీని పర్సా కృతఙ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected