Connect with us

Events

‘గాటా’ ఉగాది పండుగ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 9న

Published

on

గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ ‘గాటా’ ఉగాది పండుగ సెలబ్రేషన్స్ ఏప్రిల్ 9 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. గాటా వారి శ్రీ శుభకృతు నామ ఉగాది సెలబ్రేషన్స్ కి ఇన్ఫో స్మార్ట్ టెక్నాలజీస్ మరియు ఎవరెస్ట్ టెక్నాలజీస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కాకతీయ కిచెన్ విందు భోజనాల స్పాన్సర్.

ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, ఫ్యాషన్ షో, గాటా మహాలక్ష్మి, సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్స్ కానున్నాయి. ఆల్ఫారెటా లోని దేశాన పాఠశాల వేదిక. సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమానికి ప్రవేశం మరియు విందు భోజనాలు ఉచితం. మన టీవీ యాంకర్ లావణ్య గూడూరు వ్యాఖ్యానం చేయనున్నారు.

ఎబ్రాడ్ పట్టు స్పాన్సర్ చేస్తున్న ఫ్యాషన్ షో ని శ్రావణి రాచకుల్ల మరియు అనూష వల్లెప్ నిర్వహించనున్నారు. అలాగే గాటా మహాలక్ష్మి కార్యక్రమాన్ని అనూష వంగర మరియు నీలిమ సేన్ నిర్వహిస్తున్నారు. గాటా మహాలక్ష్మి విజేతల బహుమతులను నారీ డిజైనర్ స్టూడియోస్ బై అనూష స్పాన్సర్ చేస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments