గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకీ బరువెక్కుతూ గుదిబండగా మారుతున్న గ్యాస్ బండ తీరు చూస్తుంటే మళ్ళీ జనాలు ఉఫ్ ఉఫ్ అంటూ కట్లె పొయ్యి వైపు చూసే రోజులు దగ్గిరలోనే ఉన్నట్టున్నాయి. పక్షం రోజుల్లోనే సిలెండర్ పై 50 రూపాయలు పెరగడం విశేషం. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో నల్లబజారుకి గిరాకీ పెరుగుతుంది. గత 7 సంవత్సరాలలో సిలెండర్ ధర దాదాపు రెట్టింపయ్యింది. ప్రభుత్వాలు పన్నులు పెంచడమే ముఖ్య కారణమంటున్నారు మేధావులు. పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రాలు, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిందలు మోపడం తప్ప, ధరల నియంత్రణకు ప్రయత్నించిన ఆనవాళ్లు లేవు. పెట్రోలు, డీజిల్ ధరలు కూడా రివ్వు రివ్వు మంటూ ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా కష్టాలు, సంపాదన పెద్దగా లేకపోవడం, నిత్యావసర ధరలు పెరగడం వంటి తదితర కారణాలతో సగటు మనిషి జీవనం రోజు రోజుకీ భారంగా మారుతుంది.