ప్రతి సంవత్సరం వినాయక చవితి (Ganesh Chaturthi) పండుగని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పండుగలో వినాయక నిమజ్జనం ముఖ్య ఘట్టం. ఆ గణనాధుని ఊరేగింపుగా తీసుకెళుతున్నప్పుడు హెలికాప్టర్ లో నుంచి పూలు చల్లడం పెద్ద హైలైట్.
సెప్టెంబర్ 3 శనివారం రోజున వినాయక నిమజ్జనం (Ganesh Visarjan) లో భాగంగా ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రోజంతా పూజలు, పాటలు, నృత్యాలు, రంగోలి, పెయింటింగ్, హోలీ, టపాసులు, కత్తి సాము, హెలికాప్టర్ నుంచి పూలు చల్లడం మరియు లడ్డు ఆక్షన్ వంటి పలు కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 100 శాతం పర్యావరణానికి అనుకూలమైన మట్టితో చేసిన ఆ గణేష్ మహరాజ్ దర్శనం అందుకొని నిమజ్జనం లో పాల్గొనేలా భక్తులు అందరూ సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల కల్లా రివర్డేల్ లోని హిందూ టెంపుల్ (Hindu Temple of Atlanta) కి రావలసిందిగా కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు.