Dallas, Texas: నాట్స్ (NATS) సేవాభావంపై టెక్సస్ ఫుడ్ బ్యాంక్ (Texas Food Bank) ప్రశంసలు. భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా డల్లాస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్‌ను (Food Drive) ఈ సారి కూడా చేపట్టింది.
గాంధీ (Mahatma Gandhi) జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలు, వెయ్యికి పైగా ఫుడ్ క్యాన్స్‌ను నాట్స్ డల్లాస్ సభ్యులు సేకరించారు. అలా సేకరించిన ఆహారాన్ని తాజాగా టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు (Texas Food Bank) నాట్స్ సభ్యులు అందించారు.
నాట్స్ 918 పౌండ్లు బరువు ఉన్న ఆహారపు పదార్ధాలను ఫుడ్ బ్యాంక్ (Food Bank) కు ఇవ్వడం ద్వారా దాదాపు 765 మందికి ఒక పూట భోజన సదుపాయం కల్పించవచ్చని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు తెలిపింది.. గత పద్నాలుగు ఏళ్లుగా ప్రతి సంవత్సరం నాట్స్ చేస్తున్న ఈ ఫుడ్ డ్రైవ్‌ని నిర్వహిస్తున్న నాట్స్‌ని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు (North Texas Food Bank) ప్రతినిధులు ప్రశంసించారు.
నాట్స్ ఫుడ్ డ్రైవ్ (NATS Food Drive) లో పాల్గొన్న యువ వాలంటీర్లను (Volunteers), సభ్యులను వారిని ప్రోత్సహించి, సహకారం అందించిన తెలుగువారందరిని నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi) అభినందించారు. ఆహార పదార్ధాలను అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సేకరణ కార్యక్రమంలో అత్యంత చురుగ్గా పాల్గొన్న వేద శ్రీచరణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఫుడ్ డ్రైవ్ (Food Drive) నిర్వహణలో డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటి, అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ న్యాలమడుగుల, బద్రి బియ్యపు, ఉదయ్ పాకలపాటిపాల్గొన్నారు.
నాట్స్ (NATS) యువ సభ్యులు వేద శ్రీచరణ్, అద్వైత్, అర్ణవ్, అరిహంత్, అథర్వ్‌లతో పాటు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఎస్సీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నాట్స్ జాయింట్ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ నారె లు పాల్గొన్నారు.
గత 14 సంవత్సరాలుగా ఫుడ్ డ్రైవ్ (Food Drive) ని విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీం ని నాట్స్ చైర్మన్ప్ర శాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) లు ప్రత్యేకంగా అభినందించారు.