Edison, New Jersey, ఫిబ్రవరి 4: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా న్యూజెర్సీ ఎడిసన్‌లో ఆర్ధికాంశాలపై అవగాహన కల్పించేందుకు ఆర్ధిక సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఆర్ధిక ప్రముఖుడు ఏజీ ఫిన్‌టాక్స్ (AG FinTax) వ్యవస్థాపకులు అనిల్ గ్రంథి (Anil Grandhi) ఈ సదస్సులో తెలుగువారికి ఆర్ధిక అవగాహన కల్పించారు.
ముఖ్యంగా 2023 టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, 2024 ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలనేది వివరించారు. రియల్ ఎస్టేట్ (Real Estate) లో పెట్టుబడులకు వచ్చే పన్ను ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలకు టాక్స్ క్రెడిట్ రూల్స్ ఇలాంటి ఎన్నో అంశాలపై సమగ్ర అవగహన వచ్చేలా ఈ ఆర్ధిక సదస్సు సాగింది.
క్యాపిటల్ గైన్ ట్యాక్స్ (Capital Gain Tax) లను ఎలా తగ్గించుకోవాలి? వ్యాపారస్తులు, ఉద్యోగులు పన్నులు, ఆర్ధికాంశాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనేది అనిల్ గ్రంథి చక్కగా వివరించారు. దాదాపు 200 మందికిపైగా తెలుగువారు ఈ సదస్సుకు విచ్చేశారు. పేస్ బుక్ లైవ్ లో కూడా చాలా మంది వీక్షించి తమ సందేహాలను అనిల్ గ్రంథిని అడిగి నివృత్తి చేసుకున్నారు.
అమెరికాలో ఆర్ధిక అంశాలపై ఇంత ఉపయుక్తమైన సదస్సును నిర్వహించడం పట్ల ఈ సదస్సుకు విచ్చేసిన తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేశారు. నాట్స్ (North America Telugu Society) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీహరి మందాడి ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్, న్యూ జెర్సీ నాట్స్ విభాగ నాయకులు శ్యామ్ నాళం, టి.పి. రావు, బిందు యలమంచిలి, మురళీ కృష్ణ మేడిచెర్ల, సురేష్ బొల్లు, బస్వ శేఖర్ శంషాబాద్, మోహన్ కుమార్ వెనిగళ్ల, దేసు గంగాధర్, రమేష్ నూతలపాటి,చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, చక్రధర్ వోలేటి, డా. సూర్యం గంటి తదితరులు, వాలంటీర్లు ఈ సదస్సు విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.
స్థానిక జై స్వరాజ్ టీవీ, యూ బ్లడ్ అధినేత జగదీష్ ఎలమంచిలి కార్యాలయం లో ఈ కార్యక్రమం జరిగింది. NATS మాజీ చైర్ వుమన్ అరుణ గంటి (Aruna Ganti) కూడా సరైన టాక్స్ సమయంలో ఈ కార్యక్రమం చేసినందుకు టీం సభ్యులందరికీ అభినందనలు తెలియచేసారు.
ఆర్థిక అంశాలపై ఇంత చక్కటి సదస్సును నిర్వహించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ (North America Telugu Society) అధ్యక్షుడు బాపయ్య (Bapu Nuthi) నూతి మరియు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.