కువైట్, సౌది అరేబియా, ఖతార్ వంటి అరబ్ దేశాలకు ఇండియా, శ్రీలంక, బర్మా, నేపాల్, ఇండోనేషియా, ఫిలిపియన్ కు చెందిన ప్రజలు ఆర్థిక సంపాదనే లక్ష్యంగా వీసా తీసుకొని బ్రతుకుతెరువు కోసం అక్కడికి వెళ్లి కూలి పని చేసి సంపాదించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. పిల్లల సైతం వదిలి గల్ఫ్ కి వెళ్లి పది రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలుఎన్నో ఉన్నాయి. లక్షలు ఖర్చు చేసి అక్కడికి వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయి.బ్రతుకుతెరువు కోసం నాలుగేళ్ల క్రితం బిడ్డలను వదిలి గల్ఫ్ దేశానికెళ్లిన భార్యా భర్త స్వదేశానికి వచ్చేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అపన్న హస్తం కోసం ఎదురుచూడడంతో ఎన్నారై టిడిపి గల్ఫ్ (NRI TDP Gulf) బిసి అధ్యక్షుడు రాజు సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చిన సంఘటన అన్నమయ్య జిల్లా కెవి పల్లె మండలం మినమ రెడ్డి గారి పల్లి లో చోటుచేసుకుంది.
బాధితుల వివరాల మేరకు కె.వి పల్లె మండలం మినమ రెడ్డి గారి పల్లెకు చెందిన పసుపులేటి అరుణమ్మ ఎల్లయ్య భార్యాభర్త ఇరువురు ఇద్దరు ఆడపిల్లలు యామిని (15) హేమలత (10) సంవత్సరాల వయసు ఉన్న వీరిని వదిలి నాలుగేళ్ల క్రితం బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ (Gulf) కి వెళ్లారు. పది రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలనుకున్న వారి ఆశయం పై పకృతి కన్నేసింది రెండు సంవత్సరాల క్రితం ఎల్లయ్య భార్య మానసికంగా ఇబ్బందులకు గురైంది. దీంతో ఆజా ఈజ పై బయట ఉన్న భర్త ఆమెను తన వద్దకు తెచ్చుకొని చికిత్స చేయిస్తూ వచ్చిన జీతంతో గడుపుతున్నారు. ప్రస్తుతం అకామా లేక ఇరువురు ఆర్థికంగా స్వదేశానికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు వీరి ఇబ్బందులను గుర్తించిన ఎన్నారై టిడిపి గల్ఫ్ బిసి నాయుకుడు రాజు వీరిని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ఆర్థిక సహకారంతో వీరిని సదేశానికి పంపిచారు. ఆర్థికంగా చితికిపోయిన ప్రస్తుతం వీరి పిల్లలు వారి పెదనాన్న దగ్గర తిరుపతిలో (Tirupati) ఉన్నారు. పరాయి దేశం వెళ్లి నా తన భార్య మానసిక ఆరోగ్య పరిస్థితిని కాపాడుకునేందుకు కూడా తన దగ్గిర చిల్లి గవ్వ కూడా లేకపోవడం బాధాకరం.
పూజారి అరుణ యల్లయ్య దంపతులు ఉపాదినిమిత్తం గల్ఫ్ దేశం కువైట్ (Kuwait) వెళ్లారు. వెల్లిన కొద్దిరోజులకే అరుణ మతి స్ధితం కోల్పోయింది. గత రెండు సంవత్సరాలుగా నా అన్న వారులేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎన్నారై టిడిపి గల్ఫ్ బిసి అద్యక్షులు రాజు అలియాస్ నాగేశ్వర కొంతమంది దాతల సహకారంతో మరియు ఇండియన్ యంబసి జిలకర మురళి రాయల్ వంటి వారి సహకారంతో ఉచితంగా ఇంటికి చేర్చి లక్ష ఇరవై వేల రూపాయల ఆర్ధిక సహాయం కూడా అందజేశారు. ఇంతటి సేవా కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఎన్నారై టిడిపి గల్ఫ్ నాయుకులు గుదే నాగార్జున చౌదరి (Gude Nagarjuna Chowdary) మరియు NTR సేవాసమితి అద్యక్షుడు చుండు బాలరెడ్డెయ్య చౌదరి మరియు టిడిపి నాయకులు గుదె శంకర్ చౌదరి. వీరి ప్రోత్సాహం వలనే ఇంతటి కార్యక్రమం చేయగలిగానని రాజు ఒక ప్రకటనలో తెలిపారు.