Connect with us

Events

మనోరంజకంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ దసరా, దీపావళి సంబరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (TAGCA) వారి దసరా, దీపావళి సంబరాలు నూతన కమిటీ అధ్వర్యంలో నవంబర్ 20న ఉదయం నుండి రాత్రి వరకు నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా, ఇంతకు ముందెన్నడు జరగని రీతిలో అత్యద్భుతంగా జరిగాయి.

1000 మందికి పైగా తెలుగు వారు హాజరై దాదాపు పది గంటలపాటు సాగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, అపై జరిగిన సంగీత విభావరిని కన్నుల విందుగా వీక్షించారు. ఘనంగా నిర్వహించిన ఈ చార్లెట్ తెలుగు అసోసియేషన్ వారి దసరా, దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.

ప్రతిస్టాత్మకమైన నైట్ థియేటర్లో అత్యధ్భుతమైన కార్యక్రమాలతో చార్లెట్ నగరంలోని తెలుగు వారు ఈ వేడుకలని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. నైట్ థియేటర్ ప్రాంగణం అందమైన అలంకారంతో ముస్తాబయ్యింది. ఆహ్వానితులకి ఏర్పాటు చేసిన సింహద్వారం, ఫోటో బూత్‌లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

మధ్యాహ్నం చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యకామాలతో మొదలై, రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా కొనసాగాయి. యువతకు ప్రశంశా పత్రాలు అందజేశారు. ముఖ్యంగా తెలుగు సంగీత విభావరి మనోరంజకంగా సాగింది. తెలుగు ప్రముఖ గాయనీగాయకులు మనో, గీతా మాధురి, శ్రీకృష్ణ, శ్రీకాంత్ మరియు శ్రుతి పాటలతో పాటు మెహర్ బ్యాండ్ చార్లెట్ తెలుగు ప్రజలని ఉర్రూతలూగించారు.

గాయనీ గాయకుల సంగీతంతో పాటు సాహిత్య అద్భుతమైన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. TAGCA కార్యవర్గం గాయనీ గాయకులని, సంగీత బృందాన్ని ప్రత్యేకంగా సత్కరించింది. నృత్య గానాలతో పాటు పట్టుకుంటే కంచి పట్టు చీరలు, బంగారు మరియు వెండి ర్యాఫుల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చార్లెట్ తెలుగు వారు అద్భుతమైన ఈవెంట్ ని కని విని ఎరుగని రీతిలో అత్యంత ఆడంబరంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిధులు, ప్రేక్షకులు TAGCA కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ప్రశంసలతో ముంచెత్తారు.

నృత్య ప్రదర్శనల ఫోటోలకు www.NRI2NRI.com/TAGCADiwaliPhotos ని సందర్శించండి. అలాగే సంగీత విభావరి ఫోటోలకు www.NRI2NRI.com/TAGCAConcertPhotos ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected