Connect with us

Birthday Celebrations

న్యూజెర్సీలో వేడుకగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలు

Published

on

అమెరికాలో ఉన్న తెలుగువారితో తనకు చాలా కాలంగా విడదీయరాని అనుబంధం ఉందని, తనకు అమెరికాలో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు జన్మజన్మ రుణాను బంధంగా భావిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ జన్మదినాన్ని న్యూజెర్సీలో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో జులై 5న ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 25 ఏళ్లుగా తనకు ఎన్ ఆర్ ఐ లతో అనుబంధం ఉందన్నారు. తరచూ వాళ్ళను కలుస్తూ ఉంటామన్నారు. ఎప్పుడు కలిసిన తమ కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటామని చెప్పారు. వారి ఆప్యాయతలను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అల వేంకటేశ్వర రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చంటి క్రాంతి కిరణ్, కాలే యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు , పారిశ్రామిక వేత్తలు, డా. పైళ్ల మల్లారెడ్డి, మహేష్ బిగాల, ఇతర ఎన్ఆర్ఐ లు మరియు TRS NRI Cell ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected