. గొప్ప విద్యావేత్త డా. ఉమ ఆరమండ్ల కటికి . చెప్పిందే చేస్తూ ముందుకు సాగుతున్న వైనం . ఉధృతంగాతానా సేవాకార్యక్రమాలు . ప్రతివారం 2-3 గృహ హింస కేసుల విషయంలో మహిళలకు ఆసరా . చైతన్య స్రవంతిలో మహిళా సాధికారతకు పెద్ద పీట . చిత్తశుద్ధితో మహిళలకు నేనుసైతం అంటూ తోడ్పాటు . గతంలో చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలిగా పలు సేవలు . అభినందిస్తున్న అమెరికాలోని తెలుగువారు
మహిళలు సాధారణంగా ఎక్కువగా కష్టపడతారు, అలాగే నలుగురికి సాధ్యమైనంతవరకు సాయపడతారు అంటారు. అది తన పుట్టినిల్లైనా, మెట్టినిల్లైన లేదా సమాజంలోని సాటి మహిళల కోసమైనా. కానీ పురుషుల్లాగా అంతలా బయటికి చెప్పుకోరు, హంగు ఆర్భాటాలకు పోరు. అలాంటి ఒక మహిళే డా. ఉమ ఆరమండ్ల కటికి (Dr. Uma Aramandla Katiki).
డా. ఉమ ఆరమండ్ల కటికి గొప్ప విద్యావంతురాలు. ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) నుండి పి.హెచ్.డి (PhD) పట్టా అందుకోవడమే కాకుండా అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University) నుండి బయో ఇన్ఫర్మాటిక్స్ సర్టిఫికేషన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుండి క్లినికల్ ట్రయల్స్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ పొందారు.
సాధారణంగా ఉన్నత విద్య చదువుకున్న మహిళలకు సమాజంలోని ఇతర మహిళల సమస్యల పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది. 2021 లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఎన్నికైన డా. ఉమ ఆరమండ్ల కటికి ఆ విషయం మరోసారి నిరూపించింది.
తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ (Women Services Coordinator) గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కంటికి కనిపించని మరియు ఎవరికీ చెప్పుకోలేని గృహ హింస కేసులకు సంబంధించిన విషయాలు ప్రతివారం రెండు నుంచి మూడు వరకు హ్యాండిల్ చేస్తున్నారు డా. ఉమ ఆరమండ్ల కటికి.
దురదృష్టవశాత్తు అమెరికాలో కూడా ఇలాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.కల్చర్, పరువు, సమాజం వంటి పలు కారణాల రీత్యా ఎవరూఎవరికీ చెప్పుకోరు. అలాగే TANA Women Services Coordinator డా. ఉమ ఆరమండ్ల కటికి కూడా అప్పటి నిబంధనల మేరకు చేసే సహాయంలో గోప్యత పాటిస్తున్నారు.
కాకపోతే ప్రభుత్వ లెక్కలు బయటికి తీస్తే విస్తుపోయే నిజాలు, కేసుల సంఖ్య బయట పడతాయి.అంతే కాకుండా ఆ రెండు సంవత్సరాలపాటు పలువురిని కూడగట్టుకొని మోటివేట్ చేస్తూ తానా (Telugu Association of North America) తరపున పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
వీటిలో క్యాన్సర్ అవేర్నెస్, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్, పలు ఉచిత కంటి పరీక్ష శిబిరాలు, మహిళా త్రోబాల్ టోర్నమెంట్, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, యోగా సెషన్స్, పొలిటికల్ సెషన్స్, ఆర్ధిక స్వావలంబన సదస్సులు, ఆరోగ్య సదస్సులు, అన్నదానం వంటివి కొన్ని మచ్చుతునకలు మాత్రమే.
గత జనవరిలో ముగిసిన తానా (TANA) చైతన్య స్రవంతి కార్యక్రమాల కొరకు సైతం ఇండియా (India) వెళ్లి తన వంతుగా సహాయం చేశారు. తన తల్లితండ్రుల పేరు మీద అనాధ బాలబాలికలకు ఉపకార వేతనాల (Scholarships) ద్వారా ఆర్ధిక సాయం అందించారు.
మహిళా సాధికారత (Women Empowerment) లో భాగంగా 40 మంది మహిళలకు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా నైపుణ్య సేవలందించి మార్గదర్శకంగా నిలిచారు.అంతకు మునుపు కూడా APNRT కోఆర్డినేటర్ గా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శిగా మరియు చికాగో ఆంధ్ర అసోసియేషన్ (Chicago Andhra Association) అధ్యక్షురాలిగా పలు సాంఘిక సేవాకార్యక్రమాలు నిర్వర్తించారు.
రీసెంట్ గా గత నెలలో తన తల్లితండ్రుల జ్ఞాపకార్ధం తానా ఫౌండేషన్ మరియు లీడ్ ది పాత్ ఫౌండేషన్ (Lead the Path Foundation) ద్వారా జానపద కళాకారుల కుటుంబాలకు ఆసరాగా ఆర్ధిక సహాయం (Financial Assistance) చేశారు. అలాగే విజయవాడ లోని అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డేజ్ హోమ్ లో అన్నదానం నిర్వహించారు.
ఇవన్నీ చూసిన, తెలిసిన తానా సభ్యులు డా. ఉమ ఆరమండ్ల కటికి 2021 తానా ఎలక్షన్ ప్రచారంలో ఏమైతే చెప్పిందో, తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఎన్నికైన అనంతరం అవన్నీ నూటికి వంద శాతానికి పైగా నెరవేర్చారు అంటున్నారు. అలాగేతోటి మహిళలకు ఎప్పటికప్పుడు మార్గదర్శిగా ఉంటున్నారు.
తనపని తను చేసుకుంటూ పోతూ, వేరేవిషయాల్లో తలదూర్చడం, రాజకీయాలు చేయడం ఎరుగని డా. ఉమ ఆరమండ్ల కటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (United States of America) లో మరిన్ని పదవులను అధిరోహించి సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు అమెరికాలోని తెలుగువారు.
ప్రస్తుత తానా ఎన్నికలలో (TANA Elections) సాంస్కృతిక సమన్వయకర్తగా పోటీ చేస్తున్న డా. ఉమ ఆరమండ్ల కటికి అందరి మద్దతు కూడగట్టారు. ఈ సందర్భంగా తానా సభ్యులు (TANA Members) అందరూ తనకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు.