Connect with us

Education

తెలుగు ఆచార్యులు త్రివిక్రమ్ రెడ్డికి పురస్కారం: New Jersey Institute of Technology

Published

on

నెవార్క్, న్యూ జెర్సీ: జనవరి 24: అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాల కు న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.జె.ఐ.టీ) ఎక్సలెన్ప్ ఆఫ్ టీచింగ్ పురస్కారాన్ని ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడని ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్ కూడా చక్కగా బోధించే త్రివిక్రమ్ రెడ్డి ఎన్.జె.ఐ.టీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్లో కూడా టాప్ రేటింగ్ వచ్చిన ప్రొఫెసర్‌గా నిలిచారు మన తెలుగు బిడ్డ త్రివిక్రమ్ రెడ్డి. ఇది యావత్ తెలుగుజాతి గర్వించే విషయం.

ఒక వైపు విద్యా బోధన కొనసాగిస్తూనే మరో వైపు బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్ రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను కూడా త్రివిక్రమ్ రెడ్డి రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలకు పేటెంట్లను సాధించారు. తాజాగా ఎన్.జె.ఐ.టీ వారి ఎక్స్ లెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రివిక్రమ్ రెడ్డి తెలిపారు. తన బోధనలు, పరిశోధనలు మరింత ఉత్సాహంతో కొనసాగిస్తాను అని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected