Connect with us

Birthday Celebrations

అమెరికా రాజధాని Washington DC లో ధూళిపాళ్ల నరేంద్ర జన్మదిన వేడుకలు

Published

on

సంగం డైరీ చైర్మన్, పొన్నూరు మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) జన్మదిన వేడుకలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సి (Washington DC) లో మిత్రులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

రాజకీయ చైతన్యానికి కేంద్రమైన గుంటూరు జిల్లా నుండి తండ్రి, మాజీ మంత్రి శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి ఘన వారసత్వ రాజకీయ విలువలతో మొదలై, తెలుగుదేశం పార్టీ లో అంచలంచలుగా ఎదిగి, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడిగా, లక్షలాది గ్రామీణ రైతు కుటుంబాలకు, దశాబ్దాలుగా చేయూత నిస్తున్న సంగం డైరీ చైర్మన్ గా పూర్తి స్థాయి భాద్యతలు ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ, క్రమశిక్షణ గల ప్రజా నాయకునిగా ఎదిగారని పలువురు కొనియాడారు.

గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీ తో కోల్పోయిన సీటును మరికొద్ది నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో భారీ మెజారిటీ తో ప్రజామోదం పొంది, మంత్రిగా బాధ్యతలతో మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని, చంద్రబాబు (Nara Chandrababu Naidu)) నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునరంకితమవ్వాలని ఆకాంక్షిస్తూ.. చరవాణిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన (Satish Vemana), నరేన్ కొడాలి (Naren Kodali), విజయ్ గుడిసేవ, యాష్ బొద్దులూరి, నాగ్ నెల్లూరి, సుధీర్ కొమ్మి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, భార్గవ్, మురళి రెడ్డి, వలేటి భాను, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected