డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) దీపావళి సంబరాలు నవంబర్ 19న అదరహో అనేలా ఘనంగా నిర్వహించారు. డిటిఏ అధ్యక్షులు సంతోష్ ఆత్మకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ రఘు కుంచె, ప్లేబాక్ సింగర్స్ అదితి భవరాజు మరియు మౌనిమ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. అంతకు ముందు స్థానిక చిన్నారులు, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కాంటన్ లోని హిందూ టెంపుల్ (Canton Hindu Temple) లో ఏర్పాటు చేసిన ఈ దీపావళి సంబరాలకు సుమారు 1000 మందికి పైగా హాజరయ్యి విజయవంతం చేశారు. 175 మంది కల్చరల్ పార్టిసిపెంట్స్ ఉన్నారంటేనే అర్ధమవుతుంది ఎంత చక్కగా ఈ కార్యక్రమం విజయవంతమైందో.
ఈ సందర్భంగా కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్, వడ్లమూడి వెంకటరత్నం అవార్డ్, స్పోర్ట్స్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్, కమ్యూనిటీ సర్వీస్ లీడర్షిప్ అవార్డ్ లను పలువురికి అందజేశారు. 46 సంవత్సరాల చరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలకు పలువురు DTA మాజీ అధ్యక్షులు, స్థానిక తెలుగు కమ్యూనిటీ, తానా (TANA) నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ Detroit Telugu Association దీపావళి సంబరాలకు స్పాన్సర్స్ గా వ్యవహరించిన తానా 2023 కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి మరియు తానా చైతన్య స్రవంతి సమన్వయకర్త సునీల్ పంట్ర లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు అతిధులు ప్రసంగించారు.
పసందైన పండుగ భోజనం అందరినీ ఆకట్టుకుంది. చక్కగా అలంకరించిన ఫోటో బూత్ లో మహిళలు ఆసక్తిగా ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) తదుపరి అధ్యక్షునిగా కిరణ్ చౌదరి దుగ్గిరాల ప్రమాణ స్వీకారం చేశారు.
నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని, జగదీశ్ ప్రభల, మోహన్ ఈదర, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్ కోనేరు, వెంకట్ ఎక్కా, రమణ ముడేగంటి, హర్ష అంచె, నీలిమ మన్నే, సుధీర్ బాచు, ద్వారకప్రసాద్ బొప్పన, సత్యం నెరుసు, నాగేందర్ అయిత, వెంకట్ మంతెన తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.