Connect with us

Events

Detroit, Michigan: ఉత్సాహభరితంగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ దీపావళి వేడుకలు

Published

on

Michigan, Detroit: డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association – DTA) ఆధ్వర్యంలో 2025 సంవత్సరపు దీపావళి వేడుకలు డెట్రాయిట్ నగరంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ వేడుకల్లో 40కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 200కి పైగా స్థానిక యువతీ యువకుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

1000 మందికి పైగా తెలుగు కుటుంబాలు హాజరై దీపాల పండుగను (Diwali Festival) ఘనంగా జరుపుకున్నాయి. ఈ వేడుకలకు DTA అధ్యక్షుడు సుబ్రత గడ్డం (Subratha Gaddam), జనరల్ సెక్రటరీ రాజా తొట్టెంపూడి (Raja Thottempudi) నేతృత్వం వహించారు. తెలుగు సంఘ ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఈ కార్యక్రమంలో అనేక మంది కమ్యూనిటీ నేతలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి DTA మాజీ అధ్యక్షులు జోగేశ్వర పెద్దిబోయిన, నీలిమ మన్నే, రమణ ముదిగెంత హాజరై కార్యక్రమానికి శోభను చేకూర్చారు. అలాగే DTA మాజీ అధ్యక్షుడు మరియు ప్రస్తుత TANA ఫౌండేషన్ సభ్యుడు కిరణ్ దుగ్గిరాల, TANA జనరల్ సెక్రటరీ సునీల్ పంత్రా (Sunil Pantra) ప్రత్యేక అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.

అలాగే Troy Telugu Association, Detroit Telangana Community, Kerala Association వంటి స్థానిక సంస్థల నాయకులు, జాతీయ స్థాయి సంస్థలైన TANA, NRIVA, Global Telangana Association నాయకులు కూడా పాల్గొని DTAకు తమ మద్దతు తెలిపారు. ఈ సమాగమం తెలుగు సంఘాల మధ్య ఐక్యతను మరింత బలపరచిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంలో DTA అత్యున్నత గౌరవం “వడ్లమూడి వెంకటరత్నం అవార్డు” ను DTA మాజీ అధ్యక్షుడు మరియు తెలుగు సమాజానికి సేవలందిస్తున్న సంతోష్ అత్మకూరి కి ప్రదానం చేశారు. అదేవిధంగా DTA కమ్యూనిటీ సర్వీస్ అవార్డులు రాజా దురైరాజన్, ఆనంద్ కుమార్ కు అందజేశారు. DTA యువ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ను చంద్రవదనా కోనేరు కి ప్రదానం చేశారు.

పురస్కార గ్రహీతలు తమను ఈ గౌరవానికి ఎంపిక చేసినందుకు DTA నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. వేదికపై తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, నాటికలు, ఫ్యాషన్ షోలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పిల్లల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

యువతీ యువకులు తమ ప్రతిభతో వేదికను ప్రకాశింపజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమకు తోడ్పడిన వాలంటీర్లు, స్పాన్సర్లు, కమ్యూనిటీ నాయకులకు అధ్యక్షుడు సుబ్రత గడ్డం (Subratha Gaddam), సెక్రటరీ రాజా తొట్టెంపూడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “మన తెలుగు భాష, సంస్కృతిని అమెరికా భూమిపై నిలబెట్టే ప్రతి వేడుక ఒక కొత్త శక్తిని ఇస్తుంది.

ఇలాంటి సాంస్కృతిక వేడుకల ద్వారా మన యువతకు తెలుగు విలువలను చేరవేయగలుగుతున్నాం” అని వారు పేర్కొన్నారు. దీపావళి వేడుకలు (Diwali Celebrations) సంతోషం, ఐక్యత, సేవా భావానికి ప్రతీకగా నిలిచి డెట్రాయిట్ తెలుగు సంఘానికి మరొక చిరస్మరణీయ ఘట్టాన్ని చేర్చాయి.

error: NRI2NRI.COM copyright content is protected