డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association – DTA) దీపావళి వేడుకలు డిసెంబర్ 9 శనివారం రోజున సందడిగా జరిగాయి. కాంటన్‌లోని స్థానిక హిందూ టెంపుల్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 1000 మందికిపైగా తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
డిటిఎ (DTA) అధ్యక్షుడు కిరణ్ దుగ్గిరాల (Kiran Duggirala) అందరినీ ఆహ్వానించి దీపావళి శుభాకాంక్షలు (Diwali Wishes) తెలిపారు. డిటిఎ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ వేడుకల్లో 300 మందికి పైగా కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
కమ్యూనిటీకి సేవ చేసిన పలువురిని అవార్డులతో సత్కరించారు. ముఖ్యమైన డిటిఎ (DTA) వడ్లమూడి వెంకటరత్నం అవార్డు 2023ను సుధీర్ బచ్చుకు అందజేశారు. డిటిఎ కమ్యూనిటీ సర్వీస్ అవార్డును కళ్యాణి మంత్రిప్రగడకు, శ్రీనివాస చిత్తలూరికి, డిటిఎ కమ్యూనిటీ లీడర్ షిప్ అవార్డును వినోద్ కుకునూరుకు అందజేశారు.
అలాగే డిటిఎ కమ్యూనిటీ పార్టనర్ షిప్ అవార్డును చెంచురెడ్డి తాడి, సునీల్ మర్రికి అందజేశారు. ఈ దీపావళి వేడుకల్లో భాగంగా ఎంలైవ్ బ్యాండ్ (MLive Band) కచేరీ జరిగింది. గాయనీ సుమంగళి (Sumangali), గాయకుడు శ్రీకాంత్ లంక, సాయితరంగ్ వందేమాతరం పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలను నీలిమ మన్నె, సునీల్ పాంట్ర, టీమ్ నరేన్ కొడాలి వారు స్పాన్సర్ చేశారు.
డిటిఎ (Detroit Telugu Association) ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల, ప్రెసిడెంట్ ఎలక్ట్ సుబ్రత గడ్డం, సెక్రటరీ రాజా తొట్టెంపూడి, ట్రజరర్ ప్రణీత్ వెల్లూరు, జాయింట్ ట్రెజరర్ స్వప్న ఇల్లెందుల, పబ్లికేషన్స్ సెక్రటరీ మంజీర పాలడుగు, అర్చన చావల్ల, తేజ్ కల్లాశ్ అంగిరేకుల, సంజీవ్ పెద్ది తదితరులు విజయవంతం అయ్యేలా కృషి చేశారు.
మసాల, బాస్మతి వారు ఫుడ్‌ను అందించారు, డిటిఎ ఆర్గనైజింగ్ కమిటీ (Organizing Committee) సభ్యులు నీలిమ మన్నె (Neelima Manne), జో పెద్దిబోయిన దీప్తి చిత్రపు, సుధీర్ బచ్చు తదితరులు కూడా వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
తానా (TANA) బోర్డ్ చైర్మన్ హనుమయ్య బండ్ల, తానా మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ళ, తానా ఫౌండేషన్ (Gangadhar Nadella) మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గోగినేని డిటిఎల్‌సి (Detroit Telugu Literary Club) నుంచి రాఘవేంద్ర చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.