ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుంగనూరులో వైసీపి (YSR Congress Party) గూండాల చేతుల్లో హత్యకి గురైన టిడిపి (Telugu Desam Party – TDP) కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala) బాసటగా నిలిచి ఆర్ధిక సాయం అందజేశారు.
శనివారం కృష్ణాపురానికి వెళ్లి రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.1.50 లక్షలను అందజేసి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) అండగా ఉంటుందని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు లోకేష్ నాయుడు కొణిదల.