Dallas, Texas: BRS పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ (Dallas) నగరంలోని DR Pepper Arena వేదికగా బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు (Silver Jubilee Celebrations) ఘనంగా నిర్వహించబోతున్నట్లు బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల (Mahesh Bigala) తెలిపారు.
ఈ సందర్భంగా డల్లాస్ నగరాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ గ్లోబల్ (BRS Global) ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ తన్నీరు మహేష్ (Tanniru Mahesh), స్థానిక బీఆర్‌ఎస్ నేతలు, అభిమానులతో సమావేశమై, రాబోయే కార్యక్రమాల DR Pepper ఏరిన కామెరికా సెంటర్ (Comerica Center) లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంటల తారక రామారావు గారు (Kalvakuntala Taraka Rama Rao) హాజరుకానున్నారని మహేష్ బిగాల వెల్లడించారు. ఇది ఓ వేడుకే కాకుండా, తెలంగాణ ఉద్యమ ఆత్మను ప్రపంచానికి వినిపించే గొప్ప వేదికగా మారనుంది. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కళాకారుల ప్రదర్శనలు జరగనున్నాయి.
ఈ మహాసభకు యూఎస్ఏ (USA) లోని తెలంగాణ, తెలుగు ప్రజలు, బీఆర్‌ఎస్ (BRS) మద్దతుదారులు, ఇతర తెలంగాణ సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి అని అన్నారు. బీఆర్‌ఎస్ యూఎస్ఏ (BRS USA) అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ—“అమెరికాలోని వివిధ రాష్ట్రాల బీఆర్‌ఎస్ మద్దతుదారులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహించనున్నాయి. ఇది అమెరికాలో బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi) చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక అవుతుంది” అని తెలిపారు.
ఎల్కతుర్తిలో (Elkathurthy) జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ (Silver Jubilee) సభ తరహాలోనే, డల్లాస్ (Dallas) లోని ఈ వేడుక కూడా చరిత్రలో నిలిచిపోయేలా చేయడం లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యవేక్షణలో బీఆర్‌ఎస్ USA నాయకులూ, శ్రీనివాస్ శురభి (Srinivas Surabhi), హరీష్ రెడ్డి (Harish Reddy), శ్రీనివాస్ సురకంటి (Srinivas Surakanti) మిగితా సభ్యులు పాల్గొన్నారు.