ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా Cric Qatar 19వ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు కార్నివాల్ క్రీడా స్ఫూర్తితో నిండిపోయింది. దోహాలో హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్‌లలో క్రిక్ ఖతార్ ఒకరు. ఈ వన్డే టోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌లు నిరంతరం ఆడటంతో క్రీడా కోలాహలం కనిపించింది.
Cric Qatar ఛైర్మన్ & వ్యవస్థాపకుడు సయ్యద్ రఫీ మాట్లాడుతూ… ప్రతి టోర్నమెంట్ ను వివిధ శ్రేణీలలో అత్భుతంగా నిర్వహించడం ఒక గొప్ప అనుభూతి అని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సాయంత్రం ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు గద్దె శ్రీనివాస్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
అలాగే టోర్నమెంట్లు, లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించి క్రీడాకారులకు పూర్తి వినోదాన్ని అందించిన సయ్యద్ రఫీ సేవలను కొనియాడారు. టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించడంలో సహకరించిన మహమ్మద్ ఇర్ఫాన్‌కు సయ్యద్ రఫీ (Syed Rafi) కృతజ్ఞతలు తెలిపారు.
ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ గోల్డెన్ స్టార్ క్రికెట్ క్లబ్ మరియు QTSP జట్ల మధ్య జరిగింది గోల్డెన్ స్టార్ క్రికెట్ క్లబ్ QTSP జట్టును ఓడించి ట్రోఫీని అందుకుంది. ఈ వన్డే టోర్నమెంట్‌లో హెచ్ఐక్యూ క్రికెట్ క్లబ్, ఏషియన్ XI, గోల్డెన్ స్టార్ CC, QTSP టీమ్, NBK ఫన్ బాయ్స్, బ్లాక్ టెక్ బాయ్స్, సీ బర్డ్స్ టీమ్ మరియు షార్క్స్ XI జట్లు పాల్గొన్నాయి.