భారతదేశంలో కోవిడ్ తీవ్రత బాగా పెరిగినట్టుంది. అమెరికా సి డి సి కూడా ఇండియా వెళ్లే ప్రయాణికులకు లెవెల్ 4 అలర్ట్ ఇవ్వడం, కరోనాపై రెండో యుద్ధం తీవ్రతరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ తెలుస్తుంది. కరోనా తొలి విడత కంటే రెండవ విడత ఉధృత రూపం దాలుస్తోందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరోసారి పడక తప్పదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా రెండో ప్రభంజనం సేవలరంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఆర్థిక కార్యకలాపాలపై పరోక్ష ప్రభావం చూపి ఆర్థిక అనిశ్చితికి దారి తీయవచ్చునని అంటున్నారు. మళ్ళీ లాక్డౌన్ విధిస్తారేమో అని ప్రజలు హైరానా పడుతున్నారు.