Connect with us

Politics

మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అభినందన సభ @ Washington DC

Published

on

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో జనసేన, తెలుగుదేశం, బీజీపీ అభిమానుల సమక్షంలో మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry) గారికి ఆత్మీయ సన్మానం, అభినందన సభ నిర్వహించారు. స్థానిక జనసేన నాయకులు విజయ్ గుడిసేవ, వేణు పులిగుజ్జు, శౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్నారు. పలువురు వక్తలు బాల శౌరి గారి రాజకీయ ప్రస్థానాన్ని, నిబద్ధతనూ, ప్రజా శ్రేయస్సుకై ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలనూ గుర్తుచేస్తూ కొనియాడారు.

పార్లమెంట్ సభ్యులు (Member of Parliament) బాలశౌరి మాట్లాడుతూ.. అందరం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుండే వచ్చామని.. కష్టపడి చదువుకొని.. అవకాశాలను అందిపుచ్చుకుని ఈనాడు ప్రపంచవేదికపై తెలుగువారు అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజా సేవే అని, ప్రవాసులు ఇక్కడ నుండి సైతం రాష్ట్రం గురించి ఆలోచించి పలు రంగాలలో చేయూత నందిస్తున్నారని అభినందించారు.

ఈనాడు తమ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణాభివృద్ధిపై సారించి మధ్య, పేద వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారితో కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రవాసులు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రగతిలో భాగమేనని మనందరి ముందున్న లక్ష్యం పోలవరం, రాజధాని అని.. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలతో పనిచేస్తున్నామన్నారు.

జనసేన (Jana Sena Party) నాయకులు విజయ్ గుడిసేవ, శౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, వేణు పులిగుజ్జు మాట్లాడుతూ.. జనసేన పార్టీ, కూటమి విజయానికి పనిచేసిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తూ.. అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి పిలుపు మేరకు పార్టీ పటిష్టతకూ, అభివృద్ధి కార్యక్రమాలకైనా తమవంతు సంపూర్ణ సహకారమందిస్తామన్నారు.

తెలుగుదేశం వేమన సతీష్ మాట్లాడుతూ.. కేవలం రాష్ట్రాభివృద్ధి, యువత భవిత లక్ష్యంగా సాగుతున్న నరేంద్రమోడీ (Narendra Modi), చంద్రబాబు (Nara Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), లోకేష్ (Lokesh Nara) గార్ల నాయకత్వం రాష్ట్రానికి వరమన్నారు. వృత్తి, ఉపాధి రీత్యా ఇక్కడున్న తమ ఆలోచనలు, ఆకాంక్ష ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతే అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన (Jana Sena Party – JSP), తెలుగుదేశం (Telugu Desam Party – TDP) ప్రతినిధులు..శ్రీరామ్, బాలా, విజయ్ కొచ్చెర్ల, సుధీర్ కొమ్మి, భాను మాగులూరి, సుధాకర్, కృష్ణ, రవి అడుసుమిల్లి, అవినాష్, సిద్దు, యస్వంత్, పలువురు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected