Connect with us

Government

Coffee with Cops: నాట్స్ వినూత్న కార్యక్రమం @ Tampa, Florida

Published

on

ఆగస్ట్ 23, టాంపా బే: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా టాంపా బే లో కాఫీ విత్ ఎ కాప్ వర్క్ షాప్ నిర్వహించింది. స్థానికంగా ఉండే అధికారులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు పెంచడంతో పాటు స్థానిక నియమ నిబంధనలపై అవగాహన కల్పించేలా జరిగిన ఈ వర్క్ షాప్‌కి మంచి స్పందన లభించింది.

ప్లోరిడాలో నాట్స్ (NATS) సభ్యులు ఈ వర్క్ షాప్‌కు హాజరయ్యారు. టాంపా బే డిప్యూటీ పోలీస్ అధికారి జాన్ ఫుట్ మాన్ కాఫీ విత్ కాప్ వర్క్ షాప్‌కి వచ్చి ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, స్థానికంగా ఉండే నియమ నిబంధనల (Law Enforcement) గురించి చక్కగా వివరించారు.

ఈ వర్క్ షాప్ నిర్వహించిన నాట్స్ (North America Telugu Society) నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాజేష్ కాండ్రు, విజయ్ కట్ట, శ్రీనివాస్ అచ్చిరెడ్డి, సుధీర్ మిక్కిలినేని తదితరులు కీలక పాత్ర పోషించారు.

నాట్స్ మాజీ ఛైర్మన్ , నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ అధ్యక్షులు ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ వర్క్‌షాప్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.

ఈ వర్క్‌షాప్ కోసం సహకరించిన, పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ (NATS) కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected