Connect with us

Government

చికాగో ప్రవాసులతో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ భేటీ, పెట్టుబడులతో రావాలని పిలుపు

Published

on

అమెరికా పర్యటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి చికాగో ప్రవాసులతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 24న చికాగోలోని డౌనర్స్ గ్రోవ్‌ లో ఈ భేటి జరిగింది. డిప్యూటీ మేయర్ తోపాటు కార్పొరేటర్ సామల హేమ, టీటీసీసీసీ అధ్యక్షురాలు శోభనారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నాట్స్ నాయకులు, ఎంటర్ ప్రెన్యూర్ శ్రీనివాస్ పిడికిటి సమన్వయంతో ఈ భేటి ఏర్పాటు చేశారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ముఖ్యంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎలా ఎదుగుతుంది, మల్టినేషనల్ కంపెనీలకు ఎలా వేదికగా మారుతుందనే అంశంపై డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి వివరించారు. ఎన్.ఆర్.ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై నాయకులు, పారిశ్రామికవేత్తలు మహేష్ కాకర్ల, మదన్ పాములపాటి, శ్రీని యార్లగడ్డ, శ్రీనివాస్ బొప్పన, శ్రీని అరసడ, రవి శ్రీకాకుళం, కె.పి., విజయ్ వెనిగళ్ల, లక్ష్మి బొజ్జ, బిందు బాలినేని, అను, అనిత, రాధ, సుమతి, సుధ, డాక్టర్ నీలిమ, శోభ, దేవి, రాజేష్ వీదులమూడి, కృష్ణ నున్న, కృష్ణ నిమ్మగడ్డ, మనోహర్ పాములపాటి, ఆర్కే, హరీష్ జమ్ముల తదితరులు పాల్గొన్నారు.

చికాగోలో ప్రజా రవాణా, కోవిడ్ పరీక్షా కేంద్రాలు, పార్కుల నిర్వహణ, పారిశుధ్యం, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కార్యకలాపాలు ముఖ్యంగా ఫ్లాష్ వరద నీటి నియంత్రణ ప్రక్రియ పరిశీలించడానికి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకులతో కలిసి నాపర్విల్లే, షాంబర్గ్ నగర ప్రాంతాలను సందర్శించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected