చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association – CAA) వారు ఆగస్టు 11న ICO (Indian community outreach) Rotary Hill నేపర్విల్ లో నిర్వహించిన India Day Parade లో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు. వేలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం పాల్గొన్నవారందరినీ చాలా ఆనంద పరచింది. CAA సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో CAA బృందం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దేశభక్తి (Patriotism) పాటలతో, నృత్యాలతో పిల్లలు పెద్దలు ప్రేక్షకులని అలరించారు. ప్రవల్లిక పద్యాల భరతమాత గా స్ఫూర్తినిచ్చారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల సంస్కృతి (Telugu States Culture) ని తెలియజేస్తూ ఒక శకటాన్ని తెలుగు తల్లి మరియు నందీశ్వరుల తో బోస్ కొత్తపల్లి, ఆశ్రిత్ కొత్తపల్లి, హరిణీ మేడ, శృతి కూచంపూడి, శ్రీనివాస్ పద్యాల, శ్రీ వాసవీ తెంకుమల్ల, నవీన్ కుమార్ తెంకుమల్ల మున్నగు వారు చాలా అందంగా అలంకరించి ప్రదర్శించారు.
చికాగో ఆంధ్ర సంఘ (Chicago Andhra Association) మహిళలు అమరావతీ నగరం కూర్చిన చక్కటి గీతానికి శ్వేత కొత్తపల్లి, శరణ్యా నక్క, మాలతి దామరాజు, శ్రీ వాసవీ తెంకుమల్ల, శిరీశ పద్యాల, అనూష బెస్త, లాస్య మంగిపూడి, శిరీష వీరపనేని, శ్రీ స్మిత నండూరి, శైలజ సప్ప, హరిణి మేడ, సౌజన్య దేవరపల్లి, రాధిక గరిమెళ్ళ, సత్యవాణి ప్రెక్కి, ఉమ కొత్తమాసు, తేజస్వి శరణ మున్నగు వారు కోలాట నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇటీవల భారత జట్టు విజేతగా నిలిచిన T20 Cricket World Cup విజయాన్ని పురస్కరించుకొని చికాగో ఆంధ్ర సంఘ Sports విభాగ సభ్యులు ప్రసాదరావు చుండూరు రాజశేఖర్ చుండూరు, గణేశ్ చుండూరు, కార్తిక్ చుండూరు, అభిరామ్ నండూరి, అవినాష్ నండూరి, సురేశ్ ఐనపూడి తదితరులు ఆడిన క్రికెట్ (Cricket) ఆట ప్రదర్శనలో దేశవిదేశీయులెంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
CAA సంఘ బోర్డు సభ్యులు, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, లక్ష్మి నాగ్ సూరిభొట్ల, గీతిక మండల, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, ట్రస్టీలు సుజాత అప్పలనేని, మల్లీశ్వరి పెదమల్లు, దినకర్ కారుమూరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.