పేద కుటుంబాలకు పెళ్లి అనే శుభకార్యం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత కంటే ఆర్థిక భారాన్ని తెచ్చి పెడుతుంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినంసందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గ ప్రజల కొరకు శ్రీనివాస్ ఉయ్యూరు ఆధ్వరంలో తిరిగి చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు.
వరుస కరువులు, పెరుగుతున్న అప్పులు, పెళ్లీడుకొచ్చిన ఆడబిడ్డలు, కడుపునిండా తిండి దొరికే పరిస్థితి కష్టం. మరి పిల్లల పెళ్లి? కళ్ళ ముందు కదలాడే బిడ్డలను చూస్తూ పేదింటి తల్లిదండ్రులు కుంగిపోయే పరిస్థితి. ఇలాంటి సమయంలో పేదింటికి పెద్ద కొడుకులా తానున్నానంటూ మాజీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టిన పధకాన్ని గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పేద ప్రజల కొరకు శ్రీనివాస్ ఉయ్యూరు ఆధ్వరంలో తిరిగి ప్రారంభిస్తున్న పథకమే ‘చంద్రన్న పెళ్లి కానుక’.
గుంటూరు (Guntur) పశ్చిమ నియోజక వర్గ నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారం కాకూడదనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ ఉయ్యూరు (Srinivas Vuyyuru) ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభిస్తున్న పథకమే ‘చంద్రన్న పెళ్లి కానుక’. ఈ పథకం కింద లబ్ది పొందదలచినవారు www.cbnpk.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పొందవచ్చు.
వెబ్ సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంది. దాన్ని పూర్తి చేస్తే పనైపోతుంది. లేదా గుంటూరు లోని ఉయ్యూరు ఫౌండేషన్ ఆఫీస్ ని సంప్రదించండి.ఈ పథకం ద్వారా సామాజికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పేద కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కలగడం మాత్రమే కాకుండా వధువుకు వివాహ భద్రతను అందిస్తుంది.
వయసు నిర్ధారణ ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించవచ్చు. వివాహాల రిజిస్ట్రేషన్ ద్వారా వధువు వైవాహిక జీవితానికి రక్షణ కల్పించవచ్చు. పెళ్లికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యమైతే సాయం పొందడం కష్టమవుతుంది. బాల్య వివాహాలకు ఎలాంటి సాయం అందదు.చంద్రన్న పెళ్లి కానుక కోసం ఏ విధంగా రిజిస్టర్ చేసుకున్నా వివరాలన్నీ ఫౌండేషన్ డాష్ బోర్డు కు వెళతాయి.
ఫౌండేషన్ వారు వధూవరుల ఇంటికి వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. అనంతరం తక్షణమే వధువు బ్యాంకు ఖాతాకు 20 శాతం, పెళ్లి రోజున మిగిలిన 80 శాతం నగదు జమ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు పేద ప్రజలకు రూ. 25 వేలు. పేదల కల్యాణాలకు సాయం చేయడం ద్వారా తెలుగు దేశం చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఆధ్వరంలో పేదల సంక్షేమంలో ఎప్పుడు ముందుంటుంది.