తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా లోని మదనపల్లె లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక శేషసాయి కల్యాణ మండపంలో డిసెంబర్ 28, 29 తేదీలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు.
ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న లోకేష్ నాయుడు వచ్చే బుధవారం డిసెంబర్ 28 సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించే తానా కళోత్సవాల సభలో 40 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, 40 సైకిళ్ళు, పేద మహిళల జీవనోపాధి కొరకు 30 కుట్టు మిషన్లు అంజేయనున్నారు. అనంతరం తెలుగు సినీ సింగర్స్ సింహ మరియు శృతి చక్కని పాటలతో అలరించనున్నారు.
రెండో రోజు డిసెంబర్ 29 గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మామోగ్రఫీ, బిఎంఐ, పాప్స్మియర్, ఛాతి ఎక్సరే, ఓరల్ పరీక్షలు, క్లినికల్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయనున్నారు.
ఈ మెగా సేవా కార్యక్రమాలలో మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాలవారు అందరూ పాల్గొని తానా సేవలను ఉపయోగించుకోవలసిందిగా, అలాగే ఇండియాలో ఉన్న తానా నాయకులు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణిదల కోరుతున్నారు.