న్యూ జెర్సీ లోని ఎడిసన్ నగరం (Edison, New Jersey) లో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ౦ ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల ఆధ్వర్యములో జరిగింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మోడీ (Narendra Modi) గారికి మూడో సారి విజయం చేకూరడానికి “ఛాయ్ పే చర్చ”, “కాలతాన్”, “చౌకీదార్ మార్చ్”, “కార్ ర్యాలీస్” వంటి పలు కార్యక్రమాల ను చేయడానికి మరోసారి ప్రణాళికలు చేస్తున్నారు అని ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (Overseas Friends of BJP)అధ్యక్షులు డా. అడపా ప్రసాద్ తెలిపారు.
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ మరియు తెలంగాణ బీజేపీ ఎన్ ఆర్ ఐ జాయింట్ కన్వీనర్ విలాస్ జంబుల మాట్లాడుతూ… “దేశ ప్రధాని నరేంద్ర మోడి గారి నాయకత్యంలో మన దేశం విశ్వగురువుగా విరాజిల్లుతున్న తరుణంలో మన దేశ, రాష్ట్ర పౌరుల కర్తవ్యంగా భావించి మనం అందరం మన మోడి గారి ఆశయాలను నేరవెర్చి, మనం కన్న కలలను సహాకారం చేస్తున్న భాజపా పటిష్టతకు తమ వంతుగా సహాయ సహాకారం అందిస్తు రానున్న ఎన్నికలలో భాజపా పార్టీ బలపరిచిన అభ్యుర్థులను అత్యధిక మోజరిటి ఒట్లతో గెలిపించి మన భాజపా పార్టీ, మన తెలుగు రాష్ట్రాల అభివ్రద్దికి తోడ్పాటు అందించాలి” అని అన్నారు.
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ న్యూ జెర్సీ టీం చరణ్ సింగ్, అమర్, ధీరన్, గణేష్ మాట్లాడుతూ… ‘అవినీతి, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీనోట్లపై సర్జికల్ స్ట్రైక్, నోట్లరద్దు ,” అని స్పష్టం చేశారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ న్యూ జెర్సీ తెలంగాణ కమిటీ టీం సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగ మహేందర్ మాట్లాడుతూ… ‘ఆప్ కి బార్ మోడీ సర్కార్, ఆప్ కి బార్ 400 పార్” అనగా పార్లమెంట్ ఎన్నికలలో మిత్రపక్షాల సహకారముతో 400 ఎంపీ స్థానాలు రావాలని కోరుతున్నారు.
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ సభ్యులు (Overseas Friends of BJP) హరి సేతు, దీప్ భట్, ధీరేన్ పటేల్, గణేష్, మల్లికార్జున్, లీనా భట్, దీప్తి సురేష్ జానీ, శరద్ అగర్వాల్, వంశీ యంజాల, మధుకర్ రెడ్డి, ప్రదీప్ కట్ట, అల్కా బిజుర్వేదీ, సాయి దత్త పీఠం నుండి రఘు శంకరమంచి మరియు ఇతర సంస్థల నుండి మద్దతు తెలిపారు.