Connect with us

News

యూకేలో స్వర్ణాంధ్ర స్ఫూర్తిప్రదాత చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు విజయవంతం

Published

on

తెలుగు వారి ప్రియతమ నేత, స్వర్ణాంధ్ర స్ఫూర్తిప్రదాత, సైబరాబాద్ రూపకర్త, అమరావతి రూపశిల్పి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు సందర్భంగా యూకేలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు లండన్ లోని పలు నగరాల్లో‌ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టిన రోజు వేడుకలను జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీకిరణ్ పరుచూరి, ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని, శ్రీనివాస్ పాలడుగు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యూకేలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు, ఐటి ఉద్యోగులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు మునిరత్నం నాయుడు చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎలా ఎదిగారో అందరికీ తెలియజేసి, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం విశేషం.

చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి, జై బాబు, జై జై బాబు అంటూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచారు. ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు సేవలు అందిలంచాలని కోరుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected