క్యేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ మరియు మెడ్ స్పేక్ సంయుక్తంగా ఏప్రిల్ 16న వర్జీనియాలోని ఆష్బర్న్ నగరంలో కోవిడ్ వేక్సినేషన్ డ్రైవ్ ని నిర్వహించి 300 మందికి పైగా కోవిడ్ వేక్సినేషన్ మొదటి డోస్ ని అందజేసారు. సుధారాణి కొండపు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎందరో తెలుగువారితో పాటు ఇండియన్స్, అమెరికన్స్ కూడా వాక్సిన్ తీసుకోవడంతో పాటు వారి ఆనందాన్ని మీడియాపరంగా పంచుకోవడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని ఆమె తెలియజేసారు.
మెడ్ స్పేక్ ఫార్మశి నుంచి విజయ్ మరియు హర్ష మాట్లాడుతూ ఎన్నోరోజుల నుంచి ఫార్మశీ నిర్వహిస్తున్నాం కానీ మొట్టమొదటిసారిగా కేట్స్ ఆర్గనైజేషన్ ద్వారా మన తెలుగు వారికి ఈ విధంగా వేక్సిన్ డ్రైవ్ చేయడం చాలా తృప్తినిచ్చిందన్నారు. మళ్ళీ రెండవడోస్ కూడా మే14న నిర్వహిస్తున్నామనీ కేట్స్ కార్యవర్గసభ్యులు తెలియజేసారు.
కేట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సతీష్ వడ్డి, దుర్గాప్రసాద్, రామచంద్ర, రమణారెడ్డి, సుజిత్ లతో పాటు సురేష్ పెద్దిరెడ్డి, సునీత, లేఖని, సుమన, లీనా, హేమ, జోగీందర్, దల్జీత్ ల సహాయ సహకారాలతో ఈ డ్రైవ్ చాలా చక్కగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లకు, కార్యవర్గ సభ్యులకు, వేక్సిన్ నిర్వహణకు కావలసిన వసతినందించిన శ్రీనివాస్ ఉయ్యూరు గారికి మరియు మెడ్ స్పేక్ ఫార్మా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.