Connect with us

Events

అంగరంగ వైభవంగా రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ‘కాట్స్’ ఉగాది వేడుకలు

Published

on

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ‘కాట్స్’ వారు శుభకృత్ నామ ఉగాది వేడుకలను ఏప్రిల్ 3 ఆదివారం రోజు వర్జీనియా లోని ఆల్డి నగరం, జాన్ ఛాంప్ ఉన్నత పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా తెలుగువారు హాజరైనారు, 200 మందికి పైగా కళాకారులతో 6 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

ఇందులో భాగంగా టాలీవుడ్ గాయని సుమంగళి గారు తన గానామృతం తో అందరిని మంత్రముగ్ధులను చేసారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆకట్టుకున్నాయి. తెలుగు ఆధారిత సాంప్రదాయ వస్త్రాలంకరణ (ఫ్యాషన్ షో), టాలీవుడ్ & బాలీవుడ్ డాన్స్ లు మరియు వేదిక అలంకరణ, ఆడియో విజువల్స్ మొదలైన ఎన్నో కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ కార్యక్రమాన్ని కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ గారి అధ్యక్షతన, ఉపాధ్యక్షులు రామ యెరబండి, జెనరల్ సెక్రటరీ పార్థ బైరెడ్డి గారు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్ కౌశిక్ సామ గారు, కృష్ణ కిషోర్ గారు, రంగ సూరా గారు ప్రారంభించగా, కల్చరల్ చైర్ విజయ దొండేటి గారుకల్చరల్ కో చైర్స్ హరిత, సుప్రజ, గీత, సత్య, జ్యోతి, నవ్య, లావణ్య, అవని, జయశ్రీ, గార్లతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కోశాధికారి రమణ గారు, విష్ణు గారు, అమర్ పాశ్య, ప్రద్యుమ్న మరియు తేజ గారి పరియవేక్షణలో నిర్వహించిన చెస్ పోటీలలో గెలుపొందినవారందరికి కాట్స్ ట్రోఫీలు & మెడల్స్ ను ఫౌండర్స్ రామ్ మోహన్ కొండా గారు, ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల గారు, జయంత్ చల్లా గారి చేత అందజేశారు.

ఈ కార్యక్రమాలన్ని కాట్స్ సీనియర్ కార్యవర్గం ఫౌండర్స్ రామ్ మోహన్ కొండా గారు, చిత్రంజన్ నల్లు గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భాస్కర్ బొమ్మారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి కోలా గారు, అనిల్ రెడ్డి నందికొండ గారు, సుధారాణి కొండపు గారు మరియు అడ్వైజర్స్ రవి బొజ్జ గారు, వెంకట్ కొండపోలు గారు, ప్రవీణ్ కాటంగూరి గారు, గోపాల్ నున్న, రీజినల్ ఉపాధ్యక్షులు హరీష్ కొండమడుగు, రవి గణపురం గారు మరియు ఇతర కాట్స్ కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసాయి.

అలాగే జులై 1, 2, 3 తేదీలలో అమెరికన్ తెలుగు సంఘము ‘ఆటా’ నిర్వహించే 17వ మహాసభలకు కోహోస్టుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము అని కాట్స్ కార్యవర్గం ఈ సందర్బంగా తెలియజేసింది. ఈ వేడుకలకి ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బుజాల గారు, కన్వీనర్ సుధీర్ బండారు గారు, శ్రవణ్ పాడూరు గారు, రవి చల్ల గారు, పవన్ గారు, అమర్ బొజ్జ గారు, హనిమి రెడ్డి గారు, లోహిత్ రెడ్డి అల్లూరి గారు, మరియు ఇతర సభ్యులు హాజరు అయ్యారు.

అలాగే టీడీఫ్ నుంచి విశ్వేశర కలవల గారు, కవిత చల్ల గారు, నాటా నుంచి ఆంజనేయ దొండేటి గారు, మధు మోటాటి గారు, బాబూరావ్ శ్యామల గారు, సురేష్ కొత్తింటి గారు, సత్య పాటిల్ గారు, సతీష్ నరాల మరియు ఆప్త నుంచి కిరణ్ చందు, శ్రీని సిద్దినేని మరియు రాజేష్ అంకమ్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకి, మీడియా మిత్రులు ఎన్నారై స్ట్రీమ్స్, టీవీ9, టీవీ5, పిలుపు టీవీ, అలాగే ఉగాది భోజనం అందించిన తత్వ రెస్టారెంట్ వారికి కాట్స్ కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected