Connect with us

Devotional

శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట @ Ayodhya, 250 కార్లతో ర్యాలీ @ New Jersey, Edison

Published

on

శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22 సోమవారం రోజున అయోధ్య (Ayodhya, Uttar Pradesh) లో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికాలోని న్యూ జెర్సీ (New Jersey), ఎడిసన్ నగరం (Edison) లో ఈ రోజు జనవరి 13న పెద్ద ఎత్తున కారు ర్యాలీ నిర్వహించారు.

విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (Vishwa Hindu Parishad of America) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. రామ్ లాల్ మందిర్ (Ram Lala Mandir) లో శ్రీ రాము మూర్తి ప్రాణ ప్రతిష్ట జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఎన్నో సంవత్సరాల తర్వాత రాముల వారు పుట్టిన అయోధ్య ప్రదేశం (Ram Janmabhoomi) లో ఈ మహత్కార్యం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఆ అయోధ్య రాముడిని తలచుకున్నారు.

విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (Vishwa Hindu Parishad of America) కి చెందిన పలువురు పెద్దలు ప్రసంగించిన అనంతరం సుమారు 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతం అంతా రామభక్తితో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు సైతం పాల్గొనడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected