Connect with us

Telugu Desam Party

ఆంధ్రాలో కూటమి 164 స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు @ Boston

Published

on

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించిన సందర్భముగా టీడీపీ NRI Boston ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. సుమారుగా 125 మంది సంబరాలకు విచ్చేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాబురావు పోలవరపు ఇంతటి ఘన విజయానికి కారణమయిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు.

Boston టీడీపీ ముఖ్యులు అంకినీడు చౌదరి రావి, అనిల్ పొట్లూరి, శ్రీనివాస్ గొంది, శ్రీ బొల్లా , సూర్య తేలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి, గోపి నెక్కలపూడి, కాళిదాస్ సూరపనేని మరియు కోటేశ్వరరావు కందుకూరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేసి టీడీపీ (Telugu Desam Party) తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అంతే కాకుండా గత అయిదు సంవత్సరములుగా గత ప్రభుత్వం వారి నియంతృత్వ పాలన తో ప్రజలను ఎలా వేధింపులకు గురి చేసింది, ప్రజాస్వామ్యానికి తూట్లు ఏ విధంగా పొడిచిందో వివరించారు. ఈ విజయం లో టీడీపీ NRI Boston పాత్ర గురించి ప్రత్యేకించి స్మరించుకోవటం జరిగింది.

ముఖ్యంగా దొంగ ఓట్లు కట్టడి చెయ్యటానికి సూర్య తేలప్రోలు గారి ఆధ్వర్యంలో Tech Brains ఏ విధంగ పనిచేసిందో క్లుప్తంగా వివరించారు. గత ప్రభుత్వము చేసిన అరాచకాలకు బాధితులయిన వారిని ఆదుకునేందుకు టీడీపీ NRI Boston ఏ విధంగా విరాళాలు అందచేసి ఆదుకున్నారో తెలియ చేశారు.

ముఖ్యముగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మణులు కూటమి (National Democratic Alliance) విజయానికి తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఇక నుంచి అయినా అమరావతికి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అని విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.

Started the event by memorizing the TDP Party Founder President and the Chief Minister of combined Andhra Pradesh state, Late Sri Nandamuri Taraka Rama Rao garu with slogans Jai NTR, Jai Jai NTR. Later paid tribute to Sri Ramoji Rao garu with few minutes of silence and remembered his wonderful services rendered for both the Telugu states in various fields.

The TDP warriors with a single tone send their messsage to the newly formed NDA coalition AP Government that all responsible people from the previous YSR congress party, including YSRCP party leaders, party goondas whoever looted the valuable natural resources and further caused hundreds of crores of Rupees loss to the Government and public properties. All the looted money should be collected from those people.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected