Connect with us

Government

గాంధీ విగ్రహం వద్ద బోస్టన్ ఎన్నారై టీడిపీ సభ్యుల పసుపు ప్రతిజ్ఞ

Published

on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అమెరికాలోని బోస్టన్ సిటీ ఎన్నారైలు నవంబర్ 21న గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వర రావు, శ్రీనివాస్, అరుణ, సూర్య, త్రిభువన్, శ్రీనివాస్, అనిల్, చంద్ర, కిషోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన నడుస్తుందని, అసెంబ్లీలో ఎన్నడూ చూస్తామనుకొని దృశ్యాలు చూడవలసివచ్చిందని విచారం వ్యక్తం చేశారు.

ఇంత బాధలో కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక అమ్మలాగా వరద బాధితుల కోసం నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వేలమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దానిలో భాగంగా మేము సైతం అంటూ రెండు వేల డాలర్ల విరాళాన్ని అప్పటికప్పుడు సేకరించి తమ ఉదారతను చాటుకుంటూ తామందరం ఈ స్థాయిలో ఉండటానికి చంద్రబాబు గారి ముందు చూపేనని గుర్తు చేసుకున్నారు.

విలువలు విశ్వసనీయత అని చెప్పుకోవటం కాదు చేసి చుపిస్తున్నామని, దమ్ముంటే ప్రజలకు విశ్వతనీయతతో కూడిన పాలన అందించాలని, మయ సభ ని తలపించిన సచివాలయం ని ప్రక్షాళన చేయాలనీ, మళ్లి తమ నాయకుడిని రారాజుగా నిలబెట్టడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి కురుక్షేత్ర రణరంగం లోకి పంపినట్టు, తాము కూడా శ్రీకృషుడి వలె తమ నాయకుని వెన్నెంటే వుంటూ కొండంత అండగా ఉంటూ ప్రతిక్షణం శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి కార్యకర్త కూడా తమ ఛాలెంజ్ ని స్వీకరించి, ఆచరిస్తారని ఆశించారు.

ఈ కార్యక్రమంలో సురేష్, తేజ, నాగేంద్ర, సురేష్, శివ, విక్రమ్, అప్పారావు, పవన్ తో పాటు మరో 60 మంది, ఎముకులు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పాల్గొని “సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం, మేమంతా ఉన్నాం మీవెంటే ఉంటాం” అనే నినాదాలతో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected