Connect with us

Community Service

కువైట్ లో రక్తదాన శిబిరం: NRI TDP KUWAIT & NTR TRUST

Published

on

ఫిబ్రవరి 3న యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్. ట్రస్ట్ సౌజన్యంతో కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో నందమూరి తారక రామారావు గారి వర్దంతి సంధర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తండోప తండాలుగా తెలుగువారు వచ్చి రక్తదానం చేయడం జరిగినది.

రక్తదాన కార్యక్రమము విజయవంతం కావడానికి, ముఖ్యంగా సూచనలు సలహాలతో ముందుండి నడిపించిన, సీనియర్ నాయకులు బలరామ్ నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, సానుభూతి పరులకు, తెలుగువారికి, ప్రతి ఒక్కరికీ పెరుపేరున, ముఖ్యంగా డాక్టర్ అస్నా గారికి, బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, యన్.టి.ఆర్.ట్రస్ట్ వారికీ, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ కార్యవర్గానికి, ఇతర దేశాలు కు చెందిన అరబ్బులు, మరియు ఇతర రాష్ట్రాలుకు చెందిన బారతీయులకు, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ పెరుపేరున, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి ప్రత్యేక దన్యవాదములు తెలియచేశారు.

జనసామాన్యంలో విస్తృతంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించి, పాతుకుపోయిన వ్యవస్థల మీద యుద్ధం చేసి, రాజకీయాల్లో నాయకీయత చొప్పించిన మహనీయుడు రామారావుగారు అని. యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ సీనియర్ నాయకులు, బలరామ్ నాయుడు దరూరి, వెనిగళ్ల బాలకృష్ణ తన ప్రసంగాలలో తెలియచేశారు.

ఎన్టీఆర్ భౌతికంగా మనకు దూరమైనా, ఆయన నటించిన పాత్రలు, చేసిన సేవలు, అమలు పరిచిన సంక్షేమ పథకాలు, కట్టిన ప్రాజెక్టులు, వేసిన రోడ్లు, తెలుగు వారి గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికీ ,చిరస్థాయిగా నిలచిపోతాయి. ఇప్పటికి ఎందరో అభిమానులు ఆయనను ఒక దేవుడిగా స్మరిస్తూ, కొలుస్తూ, తరాలైనా మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు అని యన్.ఆర్.ఐ. గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు కోడూరి వెంకట్ అన్నారు.

రామారావు గారు, కాషాయ వస్త్రాలను ధరించినా, లౌకిక వాదాన్ని బలంగా నమ్మేవారని అదేవిదంగా. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో వచ్చి జాతీయవాదిగా నిలబడి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలిచిన ఓ మహాయోధుడని, ఓ కారణజన్ముడని, ఓ యుగపురుషుడని, ఆయన మనకు దూరమై 27 ఏళ్లు అవుతున్నా కూడా, ప్రజానీకం మీద అంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరని. ఇప్పటికీ, ఎప్పటికీ మనమంతా ఆయన గుర్తుల్లోనే ఉన్నామని, వుంటామని.. యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి తన ప్రసంగంలో కొనియాడారు.

NTR ఒక చరిత్ర. చిత్రజగతి, చిత్రవిచిత్ర రాజకీయ రణస్థలిలోనూ రాణకెక్కిన రాణ్మౌళి. సరస సమ్మోహన రూపం, నవ నవోన్మేష ప్రతిభా భాస్వంత చైతన్య స్వరూపం నందమూరి తారక రామ నామధేయం. ఆయన జీవితం ధ్యేయానికి కట్టుబడిన అధ్యాయం. నటుడు,నిర్మాత, దర్శకుడు,నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు. చిత్రజీవితం లోనే కాదు, నిజ జీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి,శాసించి, భాసించిన ప్రభంజనుడు. సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన, వ్యక్తి కాదు శక్తి అని యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ తన ప్రసంగంలో కొనియాడారు.

స్త్రీ చిన్నప్పుడు తండ్రిమీద, సంసార జీవితంలో భర్తమీద, వృద్దాభ్యంలో కొడుకుమీద అధారపడి బ్రతుకుతూ కొనసాగుతున్న స్త్రీ పురుషుల అసమాన సహజీవన విధానాన్ని సమాన సహజీవనంగా రూపోందించి వారసత్వ సంపదలో సమాన హక్కులు కల్పిస్తూ శాసనం జారీ చేయించిన మహానుభావుడు, తెలుగింటి ఆడపడుచులు ఆయనను “అన్న” అని అప్యాయంగా పిలుస్తున్నారు అని యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ప్రధాన కార్యదర్శి మల్లి మరోతు తెలియచేశారు.

తెలుగు జాతికీ, భాషకూ విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సాధించిన విజయాల గురించి, అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన నటజీవితంలో అనితరసాధ్యమైన ఎన్నో మైలురాళ్ళున్నాయి. రాజకీయ తెరపైనా ఎన్టీఆర్‌ ముద్ర సుస్పష్టం. అని రాచూరి మోహన్, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ కోశాదికారి తన ప్రసంగంలో తెలియచేశారు.

ఎన్టీఆర్ భౌతికంగా మనకు దూరమైనా, ఆయన నటించిన పాత్రలు, చేసిన సేవలు, అమలు పరిచిన సంక్షేమ పథకాలు, కట్టిన ప్రాజెక్టులు, వేసిన రోడ్లు, తెలుగు వారి గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికీ ,చిరస్థాయిగా నిలచిపోతాయి. ఇప్పటికి ఎందరో అభిమానులు ఆయనను ఒక దేవుడిగా స్మరిస్తూ, కొలుస్తూ, తరాలైనా మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు అని యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాస రాజు వెలిగండ్ల అన్నారు.

పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, బడుగు బలహీన, అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, పాలనలో భాగస్వామ్యం కల్పించి తెలుగుదేశం అంటే నీది, నాది, మన అందరిది, చెప్పిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ NTR రామారావు గారు, ఆయన గురించి మాట్లాడడమంటే, సూర్యుడిని వేలుతో చూపించి నట్లవుతుందని యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అసమా గవర్నరేట్ కొఒర్డినేటర్ ముస్తాక్ ఖాన్, జాయింట్ కొఒర్డినేటర్ గూబల నరసింహులు, వారి కార్యవర్గం, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ఫర్వానియా గవర్నరేట్ కొఒర్డినేటర్ రమేష్ కొల్లపనేని, జాయింట్ కొఒర్డినేటర్, వలసాని శంకర్ యాదవ్, వారి కార్యవర్గం, యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ హవల్లి గవర్నరేట్ కొఒర్డినేటర్ ఓలేటి రెడ్డయ్య చౌదరి జాయింట్ కొఒర్డినేటర్ విజయ్ కుమార్ పసుపులేటి వారి కార్యవర్గం, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ జహరా గవర్నరేట్ కొఒర్డినేటర్ మల్లెం హేమంత్ కుమార్, వారి కార్యవర్గం తెలియచేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ముఖ్య సీనియర్ నాయకులు యనిగల బాలకృష్ణ, సురేష్ మాలెపాటి, వినయ్ ముత్యాల, దేవాకర్ ఓలేటి, వెంకటేశ్వర్ రావు కొర్రపాటి, బోయపాటి శ్రీను, గుండయ్య నాయుడు, శ్రీనివాస చౌదరి, లక్ష్మీపతి, పేరూరు రామకృష్ణ, కాటూరి రామకృష్ణ, నాయని సుధాకర, వైకోట గ్రామస్తులు, రాజేష్ , రమేష్ తదితరులు, బొమ్ము నరసింహులు, నర్సింగ రావు దనరాశి, శివ మంచూరి, సాయి, నిర్మలా ముండ్లపాటి, సత్యవతి, ఇందు, అద్దేపల్లి రామ్మోహన్ రాజు, దొడ్డిపల్లి సుబ్బరాజు, బొమ్ము నరసింహులు, శివకుమార్ గౌడ్, ఆవుల చిన్నయ్య యాదవ్, గుండయ్య నాయుడు, పేరూరు రామకృష్ణ, పెంచలయ్య పెరుమాళ్ల, ఈ కార్యాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి దన్యవాదములు తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected