Connect with us

Concert

నాట్స్ తెలుగు వేడుకలలో కార్తీక్ కాన్సర్ట్ తో హోరెత్తిన Dallas; ఇసుక వేస్తే రాలనంత జనం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగు వేడుకలు మార్చ్ 16 న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. న భూతో న భవిష్యత్ అన్నట్లు నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలలో కార్తీక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ కి అనూహ్య స్పందన వచ్చింది.

10,000 మందికి పైగా Allen Event Center ఆడిటోరియం లో ఉన్నప్పటికీ, ఫైర్ కోడ్ కారణంగా ఆడిటోరియం బైట 4 వేల మంది ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. పోటెత్తిన తెలుగు ప్రజలతో కార్తీక్ (Singer Karthik) గాన ప్రవాహంలో మునిగిపోయిన తెలుగువారు అనేలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

నాట్స్ చరిత్రలో నిలిచిపోయే ఈ తెలుగు వేడుకలలో స్టేడియం వేదిక అంతా కిక్కిరిసిపోయింది. వేల మంది తెలుగు (Telugu) వారి మధ్య హోరెత్తిన తెలుగు పాటలతో అభిమానుల ఆనంద హేలలో ఊగిపోయారు. ఒక సమయంలో ఒక్కసారిగా అందరూ సెల్ ఫోన్ లైట్స్ తో స్టేడియాన్ని కాంతులతో నింపారు.

ఈ ఈవెంట్ తో నాట్స్ (North America Telugu Society) యువతను బాగా ఆకట్టుకుంది. నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (Bapu Nuthi) సొంత ప్రాంతమైన డల్లాస్ లో నాట్స్ స్థానిక నాయకత్వం అంతా శ్రమించి పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) నాట్స్ టీం ని అభినందించారు.

ఇండియా నుంచి విచ్చేసిన టాలీవుడ్ (Tollywood) నటీనటులతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. నవ్వుల నవాబు డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బెజవాడలో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అన్నట్లు ఉందనడం కొసమెరుపు. కొందరు నటీనటులు వేదికపై స్టెప్పులు వేయడంతో క్రౌడ్ పులకరించారు.

సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, మహిళా సాధికారత (Women Empowerment) కార్యక్రమాలు, వ్యాపార చర్చలు, సినీ తారలతో ఇష్టాగోష్టి, సాహిత్య కార్యక్రమాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు మరియు నాట్స్ నాయకుల ప్రసంగాలు, నాట్స్ (North America Telugu Society) సేవల వివరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అంతకు ముందు రోజు మార్చ్ 15న నాట్స్ బోర్డు సమావేశం (Board Meeting) నిర్వహించారు. అమెరికా నలుమూలల నుంచి నాట్స్ నాయకులు ఈ రెండు రోజుల కార్యక్రమానికి హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలనంత జనం తో నిర్వహించిన ఈ కార్యక్రమంతో నాట్స్ మరో మెట్టు పైకెక్కింది.

ఇదే తెలుగు వేడుకల వేదికపై ప్రముఖ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. దీంతో పాటు ప్రముఖ కవి కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రికి కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించి దానిని వారి కుటుంబ సభ్యులకు అందించింది.

స్థానిక శ్రీచక్ర కళా నిలయం, రాగమయూరి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐక్య బ్యాండ్, తాళం పరై & పాయిల్ ఆన్ లైన్ వారి డప్పు నృత్యం, మధురాజ్ డ్యాన్స్ గ్రూపు తెలుగుపాటలకు డ్యాన్స్ వేసి ప్రేక్షకుల్లో జోష్‌ని నింపారు. రోబో గణేశన్ ప్రదర్శన కూడా అందరిని అలరించింది. హీరోయిన్ కాథెరీన్ ట్రెసా, హీరో, హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి, హీరో సత్యం రాజేష్ ల ప్రత్యేక సంభాషణ, ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను (Udaya Bhanu) ల వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి.

నాట్స్ స్టూడెంట్స్ స్కాలర్ షిప్‌లను అందించారు. ఈసందర్భంగా డా. మధు కొర్రపాటి, డా. సుధీర్ .సి. అట్లూరి, శ్రీనివాస్ గుత్తికొండ, డా. వెంకట్ ఆలపాటి, మురళీ మేడిచెర్ల, ఆనంద్ కూచిభొట్ల, మైత్రేయి ఎడ్లపల్లి లకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ ను, కే.ఎస్. లక్షణరావు (M.L.C), వీరమ్మ మాదల, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) Mr & Mrs. Moncho Ferrer, ఉత్తమ సేవా పురస్కారాలను కూడా అందించింది.

నాట్స్ (North America Telugu Society) డల్లాస్ తెలుగు వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని నాట్స్ డల్లాస్ (Dallas) తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాల అభినందించారు.. సమిష్టి కృషి వల్లే వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు.

నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో నాట్స్ (NATS) నాయకులు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రశంసించారు. డల్లాస్‌లో నాట్స్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగు ప్రజలు, స్పాన్సర్స్ ఆ కార్యక్రమాలకు ఇస్తున్న మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected