Connect with us

Politics

భాజపా నేతలు చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దమ్మర గుడిసెలు

Published

on

ఈ మధ్య భారతీయ జనతా పార్టీ నేతల తీరు చూస్తుంటే చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దమ్మర గుడిసెలు అనే సామెత వారికి తప్ప మరెవ్వరికీ సూటు కాదన్నట్టు ఉంది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ రోజు జరిగిన ఎలక్షన్ కాంపెయిన్ సభలో మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు గాలి సోమశేఖర రెడ్డి తో భాజపా నేత నరేంద్ర మోడీ చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. ఎవరన్నా చుస్తే నవ్వుతారనే సిగ్గు కూడా లేకుండా పక్కన పెద్ద అవినీతి పరుడిని పెట్టుకొని అవినీతిరహిత భారతదేశం, నీతి నిజాయితీ అంటూ ఊదరగొట్టేసాడు. బయట దేశాల నుంచి నల్లధనం తెప్పించడం సంగతి దేవుడెరుగు, నీరవ్ మోడీ విజయ్ మాల్యా లాంటి అవినీతి పరులు దేశం దాటెల్లిపోతుంటే చోద్యం చూస్తూ మిన్న కున్న వీళ్ళు అవినీతిని తరిమి కొడతారంట. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో కరప్షన్ కింగ్ జగన్మోహన్ రెడ్డి ని కేసుల సాకుతో కాళ్లకు తాడేసి పట్టుకొని అవసరానికి వాడుకుంటున్న మోడీ నోట నీతి సూక్తులు రావడం పెద్ద కామెడీ అయిపోయింది.

error: NRI2NRI.COM copyright content is protected