ఈ సంవంత్సరం నేషనల్ శాసనసభ్యుల కాన్ఫరెన్స్ అమెరికా లోని బోస్టన్ (Boston, Massachusetts) నగరంలో జరుగుతుంది. ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజనీర్ కూన రవి కుమార్ బోస్టన్ కు వచ్చారు. భారతదేశం నుంచి 165 మంది ప్రజాప్రతినిధులు వచ్చిన ఈ సభ కి మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యే రవి కుమార్ ఒక్కరే విచ్చేసారు.
ఈ సందర్భంగా ఆముదాల వలస ఎమ్మెల్యే రవి కుమార్ బోస్టన్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోస్టన్ మహానగరంలో 2022 మహానాడు ను దిగ్విజయముగా జరిపిన NRI TDP New England పసుపుదళంని కలుసున్నారు.
ఈ సమావేశంలో ముందుగా అంకినీడు ప్రసాద్ (Prasad Ankineedu) తెలుగు తమ్ముళ్లని ఆహ్వానించారు. NDA కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కృష్ణప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) తన ప్రసంగంలో వివరించారు.
సూర్య తేలప్రోలు (Surya Telaprolu) మాట్లాడుతూ… గత ఎన్నికల్లో అతను నకిలీ ఓట్ల గురించి సభికులు అందరకి విశదీకరించారు. శ్రీ బోళ్ల, S4 మీడియా అధినేత, చంద్ర బాబు గారి ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధిని, పారదర్శకంగా చేస్తున్నతీరుని కొనియాడారు. సభలో పలువురు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహముగా ప్రసంగించారు.
ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (NCBN), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లోకేష్ (Nara Lokesh) చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతుంది అన్నారు. శ్రీకాకుళంలో (Srikakulam) ఎన్ఆర్ఐలు ఇండస్ట్రీస్ కారిడార్ కు దోహద పడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ ఉద్దేశము అని Koona Ravi Kumar చెప్పారు. తెలుగు తమ్ముళ్లు అందరు ఇప్పటి వరకు చేసిన కృషిని మెచ్చుకొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగముగా తమవంతు కృషి చేయాలి అని వచించారు. చివరగా వేణు కునమనేని వచ్చిన తెలుగు తమ్ములందరికి కృతజ్ఞతలు తెలిపారు.
చక్కటి విందు తోటి ముగిసిన ఈ Boston Meet and Greet సమావేశంలో సంపత్ కట్ట, విజయ్ బెజవాడ, త్రిభువన్ పారుపల్లి, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కళ్యాణ్ కాకి, రవి ముత్యాలు, శ్రీని మాగులూరి తదితరులు పాల్గొన్నారు.