అట్లాంటా వాసి భరత్ మద్దినేని మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్టు (The Circuit Court for Montgomery County, Maryland) లో నైతిక విజయం సాధించారు. అక్రమంగా, అనైతికంగా తనను ‘తానా’ ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పై భరత్ కోర్ట్ కి వెళ్లారు.
భరత్ ని ఎన్నికలలో పోటీ చేసేలా వీలు కల్పిస్తూ, బ్యాలట్ లో భరత్ మద్దినేని పేరు ఉంచండంటూ మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్టు జడ్జి TRO (Temporary Restraining Order) ఇచ్చారు. దీంతో భరత్ మద్దినేని తానా (Telugu Association of North America) ట్రెజరర్ పదవికి పోటీ చేయడానికి మార్గం సుగమమైంది.
వివరాలలోకి వెళితే.. తానా బోర్డు లో బలం ఉన్న ఒక వర్గం భరత్ పై అనర్హత వేటు వేయడం, తదనంతర ప్రరిణామాలను ఖాతరు చేయకపోవడంతో భరత్ మద్దినేని కి న్యాయస్థానమే దిక్కైంది. ఎమర్జెన్సీ మోషన్ ఫైల్ చేసి ఎలక్షన్స్ లో పాల్గొనేలా TRO (Temporary Restraining Order) ఇవ్వండంటూ న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయించారు.
ఈ రోజు, డిసెంబర్ 22, హియరింగ్ కి వచ్చిన కేసులో పూర్వాపరాలు పరిశీలించిన మీదట జడ్జి భరత్ కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో భరత్ మద్దినేని (Bharath Maddineni) మరియు టీం కొడాలి సభ్యులు జస్టిస్ ప్రివెయిల్డ్ (Justice Prevailed) అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేసులో మెరిట్ ఉండబట్టే జడ్జి TRO (Temporary Restraining Order) ఇచ్చారు. గత కేసులు పరిశీలిస్తే కూడా ఇదే స్పష్టమవుతుంది.. ఈ తీర్పు తానా బోర్డు సభ్యుల వైపరీత్య ధోరణికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. టీం కొడాలి పూర్తి విజయానికి ఈ నైతిక విజయం నాంది పలికింది అంటూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నారు.