భరత్ మద్దినేని! వినయం, విధేయత, విశ్వాసం అయన సొంతం. భరత్ అమెరికా రావడం, మాస్టర్స్ డిగ్రీ సాధించడం, ఉద్యోగం చేయడం ఒక ఎత్తైతే.. తానా లాంటి జాతీయ మరియు తామా లాంటి పలు స్థానిక సంస్థల సేవాకార్యక్రమల ద్వారా ప్రతి క్షణం ప్రజలలో ఉండడం, ఆదరణ పొందడం మరొక ఎత్తు.
గత 17 సంవత్సరాలుగా సమాజసేవలందిస్తున్న భరత్ తానా లో 23వ మహాసభల ట్రెజరర్ గా, కార్యవర్గ జాయింట్ ట్రెజరర్ గా, టీం స్క్వేర్ కో-చైర్ గా, సౌత్ ఈస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గా, విజిటర్ సర్వీసెస్ కో-చైర్ గా వివిధ హోదాలలో సేవలందిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలుగువారి అభ్యున్నతికి తోడ్పడుతున్నారు.
తానాలో మాత్రమే కాకుండా, అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ అధ్యక్షునిగా, వైస్ ప్రెసిడెంట్ గా, కార్యదర్శిగా, ట్రెజరర్ గా, టెక్నాలజీ సెక్రెటరీగా, జార్జియా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ వాలంటీర్ గా, ఆడిట్ కమిటీ సభ్యునిగా రెండు సార్లు తనదైన ముద్ర వేశారు.
TAMA 30 వసంతాల వేడుకల్లో బాంక్వెట్ కమిటీ సభ్యునిగా బాద్యతలు నిర్వర్తించారు. ఇండియా లోని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించే ప్రాజెక్ట్ కి తోడ్పాటు అందించారు. అట్లాంటాలో చిన్నారుల కోసం 400 మందితో బాలల సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
తానా (TANA) ఇచ్చే ప్రతి పిలుపులో భరత్ మద్దినేని ముందుండి నడిచేవారు. పదవులలో ఉన్నా, లేకున్నా మరెన్నో ఇతర సంస్థలలో సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తున్నారు.ఎన్నారై టీడీపీ అట్లాంటా మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరోగ్య వంతమైన సమాజం కోసం తానా 5k వాక్, తానా కేర్స్, బ్యాక్ ప్యాక్, ధీమ్ తానా, రైతు కోసం, ఫైనాన్షియల్ ప్లానింగ్, టాక్స్ సెమినార్స్, సీ.పీ.ఆర్ ట్రైనింగ్ వంటి తానా (Telugu Association of North America) సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించడంలో కృతకృత్యులయ్యారు.
తానా 23వ కాన్ఫరెన్స్ సమావేశాలకు ట్రెజరర్ గా, ప్రస్తుత తానా జాయింట్ ట్రెజరర్ గా, తామా ట్రెజరర్ గా, ఫైనాన్సియల్ ఆడిట్ కమిటీ సభ్యునిగా రెండు సార్లు కలిపి మొత్తంగా తన 17 సంవత్సరాల సంఘసేవలో ఏకంగా 5 సంవత్సరాలు ప్రత్యేకంగా ట్రెజరర్ సంబంధిత విభాగాల్లో గడించిన అనుభవంతో ప్రస్తుత తానా ట్రెజరర్ పదవికి అత్యుత్తమ అర్హుడిగా దూసుకెళుతున్నారు.
ప్రత్యక్షంగా పారదర్శక ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన అనుభవశాలి, మంచి మనిషి, సేవే లక్ష్యంగా అనునిత్యం కృషి చేసే వ్యక్తి అయిన భరత్ మద్దినేని (Bharath Maddineni) ప్రస్తుత తానా ఎన్నికల్లో (TANA Elections) ట్రెజరర్ గా పోటీ చేస్తున్నారు.
భరత్ మద్దినేని తోపాటు నరేన్ కొడాలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి అమెరికాలో తెలుగువారి అభ్యున్నతికి తోడ్పడవలసిందిగా కోరుతున్నారు.