Connect with us

News

పద్మభూషణ్, భారత్ బయోటెక్ MD డా. కృష్ణ ఎల్ల, నాట్కో ఫార్మాస్యూటికల్ VP నన్నపనేని సదాశివరావు డాలస్ లో మహాత్మాగాంధీకి నివాళి

Published

on

ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల డాలస్ నగరంలో నెలకొని ఉన్న మహాత్మాగాంధీ స్మారక స్థలిని సెప్టెంబర్ 5 సోమవారం సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

డా. కృష్ణ ఎల్ల మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచ శాంతి దూతకు డాలస్ నగరంలో నివాళులర్పించడం ఆనందంగా ఉందని, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలిని నిర్మించడంలో తీవ్ర కృషి చేసిన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరకు, వారి కార్యవర్గ సభ్యులకు, స్థానిక ప్రవాస భారతీయులకు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు.

“కోవిడ్ -19 తో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో మన తెలుగు గడ్డ మీద “కోవాక్సిన్” ను సృష్టించి 4 బిలియన్లకు పైగా వాక్సిన్లను 123 దేశాలలో సరఫరాచేసి మానవాళికి సేవ చేసిన మానవతామూర్తి, ప్రముఖ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల మరియు నాట్కో ఫార్మాస్యుటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు డాలస్ నగరంలో గాంధి స్మారక స్థలిని సందర్శించి పుష్పాంజలి ఘటించడం సముచితంగా ఉందని, అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని మహాత్మాగాంధి మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర అన్నారు.

నాట్కో ఫార్మాస్యుటికల్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ అమెరికాలోని ఇర్వింగ్ నగరంలో 18 ఎకరాల సువిశాల ఉద్యానవనంలో మహాత్మాగాంధీ స్మారక స్థలిని ఇంత భారీ స్థాయిలో, చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా నిర్వహించడం చాలా సంతోషం అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి వెన్నం, పారిశ్రామికవేత్త బ్రహ్మాజీ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected